Russia Banned: పుతిన్ చేసిన పనికి రష్యా, బెలారస్‌ ప్లేయర్లపై ఒలింపిక్ కమిటీ నిషేదం

ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ రష్యా, బెలారస్ లను నిషేదిస్తున్నట్లుగా నిర్ణయం తీసుకుంది. బ్యాడ్మింటన్ వరల్డ్ గవర్నింగ్ బాడీ అయిన BWF మంగళవారం రష్యన్, బెలారష్యన్ క్రీడాకారులను...

Russia Banned

Russia Banned: ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ రష్యా, బెలారస్ లను నిషేదిస్తున్నట్లుగా నిర్ణయం తీసుకుంది. బ్యాడ్మింటన్ వరల్డ్ గవర్నింగ్ బాడీ అయిన BWF మంగళవారం రష్యన్, బెలారష్యన్ క్రీడాకారులను అంతర్జాతీయ ఈవెంట్లకు మినహాయిస్తున్నట్లుగా పేర్కొంది. రష్యా, బెలారస్ దేశ క్రీడాకారులతో ప్లాన్ చేసిన టోర్నమెంట్లను ఇప్పటికే రద్దు చేసేసింది.

రష్యా, బెలారస్ ప్లేయర్లను నిషేదించడానికి వరల్డ్ గవర్నింగ్ బాడీ కూడా ఆమోదం తెలిపింది. తర్వాతి నోటీసులు వెలువడే వరకూ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లకు అనుమతించొద్దని BWF స్టేట్మెంట్ విడుదల చేసింది. దీని కంటే ముందు సోమవారం జరగాల్సిన రష్యా, బెలారస్ మ్యాచ్ లు రద్దు అయ్యాయి.

అంతేకాకుండా అంతర్జాతీయ ఈవెంట్లలో, BWF ఈవెంట్లలో రష్యా, బెలారస్ జాతీయ జెండాలు కనిపించకూడదని, జాతీయ గీతాలు వినపడకూడదని ఆంక్షలు విధించారు. మరే ఇతర బ్యాడ్మింటన్ టోర్నమెంట్లను నోటీసులు ఇచ్చేంత వరకూ రష్యా, బెలారస్ ప్లేయర్లతో నిర్వహించేందుకు అనుమతుల్లేనట్లే.

Read Also: రష్యాను ఎదిరించిన 100 మంది యుక్రెయిన్ వీరులు

రష్యా, బెలారస్ లో నిర్వహించేందుకు ప్లాన్ చేసిన స్పోర్ట్స్ ఈవెంట్స్ ను వెంటనే మార్చాలని లేదా రద్దు చేయాలని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ.. స్పోర్ట్స్ ఫెడరేషన్స్ ను కోరింది.

ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌పై ప్రకటించిన 24గంటల్లోనే రాజధాని కీవ్ సమీపంలోకి రష్యన్ సేనలు చొచ్చుకుపోయాయి. ఆ రోజు నుంచి జరుగుతున్న వరుస దాడుల కారణంగా పుతిన్ పై కొన్ని దేశాలు మినహాయించి ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది.