India vs Australia Test Series: భారత్‌తో తొలి టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు మరో షాక్.. కీలక బౌలర్ ఔట్ ..

నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు నేటి నుంచి నాగ్‌పూర్ వేదికగా ప్రారంభమవుతుంది. తొలిటెస్టుకు ముందు ఆస్ట్రేలియా జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు ఆల్ రౌండర్, ప్రధాన బౌలర్ కెమెరూన్ గ్రీన్ దూరమమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ జట్టు బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ తొలిటెస్టుకు దూరమైన విషయం విధితమే. తాజాగా కెమెరూన్ కూడా తొలిటెస్టులో ఆడేది అనుమానమేనని కెప్టెన్ స్మిత్ చెప్పాడు.

India vs Australia Test Series: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్‌కు అంతా సిద్ధమైంది. రేపటి నుంచి ఇరు జట్ల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభమవుతుంది. తొలి టెస్టు ఫిబ్రవరి 9 నుంచి 13వ తేదీ వరకు నాగ్‌పూర్ వేదికగా జరుగుతుంది. ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. అయితే, తొలి టెస్టుకు ముందే ఆస్ట్రేలియా జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టుకు చెందిన ఫాస్ట్ బౌలర్, ఆల్ రౌండర్ కెమెరూన్ గ్రీన్ తొలి టెస్టు మ్యాచ్‌కు దూరమైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సైతం దృవీకరించారు. అయితే, చివరి వరకు వేచిచూస్తామని అన్నారు.

IND vs NZ ODI Series: విరాట్ ఆ విషయంలో త్యాగం చేయాలి.. అప్పుడే జట్టు కూర్పు సమస్య తీరుతుందన్న మాజీ క్రికెటర్

కెమెరూన్ ఆడే విషయంపై స్మిత్ మాట్లాడుతూ.. నాగ్‌పూర్ టెస్టులో ఆడేందుకు గ్రీన్‌కు ఇబ్బందిగా ఉందని చెప్పాడు. గ్రీన్ నెట్స్‌లో ప్రాక్టీస్‌లో కూడా పాల్గొనలేదని, ఈ క్రమంలో తొలి టెస్టుకు అతను దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలిపాడు. మ్యాచ్ ప్రారంభ సమయం వరకు వేచిచూస్తామని, ఆ సమయంలోపు గ్రీన్ మ్యాచ్‌కు అన్నివిధాల సిద్ధమైతే తుది జట్టులో ఎంపిక చేస్తామని, లేకుంటే విశ్రాంతి ఇస్తామని స్మిత్ చెప్పాడు.

India vs New zealand Series: టెస్టు జట్టులో సూర్యకుమార్, ఇషాన్‌.. కివీస్, ఆస్ట్రేలియా సిరీస్‌లకు జట్లను ప్రకటించిన బీసీసీఐ

భారత్ జట్టుతో ఆసీస్ నాలుగు టెస్టు మ్యాచ్‌లను ఆడనుంది. ఇప్పటికే ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ కూడా తొలి టెస్టుకు దూరమైన విషయం విధితమే. తాజాగా కామెరాన్ గ్రీన్ కూడా గాయం కారణంగా తొలి టెస్టుకు ఆడేది అనుమానంగా మారడంతో ఆ జట్టుకు ఇబ్బందికర పరిస్థితిగానే క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

భారత్‌ వర్సెస్ ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్‌ల తేదీలు ..

1వ టెస్ట్ – ఫిబ్రవరి 9 నుండి 13 వరకు (నాగ్‌పూర్)

2వ టెస్ట్ – ఫిబ్రవరి 17 నుండి 21వ తేదీ వరకు (ఢిల్లీ)

3వ టెస్ట్ – మార్చి 1 నుండి 5వ తేదీ వరకు (ధర్మశాల)

4వ టెస్ట్ – మార్చి 9 నుంచి 13 వ తేదీ వరకు (అహ్మదాబాద్)

ట్రెండింగ్ వార్తలు