మినీ వేలంలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్ పై కనకవర్షం కురిసింది. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన అతడి కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ హోరాహోరీగా వేలం బిడ్‌లో పాల్గొన్నాయి. అతడి ధరను అమాంతం పెంచుకుంటూ పోయాయి. చివరకు పంజాబ్ పోటీ నుంచి తప్పుకోగా చెన్నై సూపర్ కింగ్స్ రూ.14 కోట్లకు అతడిని సొంతం చేసుకుంది.
ఈ వేలానికి ముందు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌ను చెన్నై విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఓ మంచి ఆల్‌రౌండర్ కోసం చూస్తున్న చెన్నై డారిల్ కోసం పెద్ద మొత్తంలో వెచ్చించేందుకు వెనుకాడలేదు. చివరకు అతడికి సొంతం చేసుకుంది.
Pat Cummins : ఐపీఎల్ 2024 మినీ వేలంలో చరిత్ర సృష్టించిన పాట్ కమిన్స్..
ఐపీఎల్ 2022 వేలంలో రూ.75లక్షలకు డారిల్ మిచెల్‌ను రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. రెండు మ్యాచులు మాత్రమే ఆడాడు. గతేడాది వేలానికి ఆర్ఆర్ అతడిని విడిచిపెట్టింది. దీంతో కోటీ రూపాయల బేస్ ప్రైజ్‌తో అతడు వేలంలోకి వచ్చాడు. అయితే.. ఎవ్వరూ అతడి పై ఆసక్తి చూపకపోవడంతో అమ్ముడు పోలేదు.
కాగా… ఈ సారి రూ.2కోట్ల బేస్‌ప్రైజ్‌తో రాగా.. అతడి కోసం ప్రాంఛైజీలు పోటీపడ్డాయి. ఇప్పటి వరకు జరిగిన వేలంలో అతడు అత్యధిక ధర పలికిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
WI vs ENG 2nd T20 : సిక్స్ ఇలా కొట్టాలని ఇన్ని రోజులు తెలియదు భయ్యా..! వీడియో వైరల్
డారిల్ మిచెల్ ఇప్పటి వరకు న్యూజిలాండ్ తరుపున 20 టెస్టులు, 39 వన్డేలు, 56 టీ20 మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 1,452 పరుగులు, వన్డేల్లో 1,577 పరుగులు, టీ20ల్లో 1,069 పరుగులు చేశాడు. టీ20ల్లో ఐదు అర్ధశతకాలు అతడి పేరు మీదున్నాయి.
WOWZAAA 💰
Chennai Super Kings get New Zealand allrounder Daryl Mitchell for an enormous price of INR 14 Crore! 💛#IPLAuction | #IPL pic.twitter.com/1j0vfuwRRU
— IndianPremierLeague (@IPL) December 19, 2023