Pat Cummins : ఐపీఎల్ 2024 మినీ వేలంలో చ‌రిత్ర సృష్టించిన పాట్ క‌మిన్స్‌..

దుబాయ్ వేదిక‌గా జ‌రుగుతున్న ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ క‌మిన్స్ చ‌రిత్ర సృష్టించాడు.

Pat Cummins : ఐపీఎల్ 2024 మినీ వేలంలో చ‌రిత్ర సృష్టించిన పాట్ క‌మిన్స్‌..

Pat Cummins becomes most expensive buy in auction history

Updated On : December 19, 2023 / 2:33 PM IST

Australia player Pat Cummins : దుబాయ్ వేదిక‌గా జ‌రుగుతున్న ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ క‌మిన్స్ చ‌రిత్ర సృష్టించాడు. లీగ్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడైన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. రూ.2 కోట్ల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి వ‌చ్చిన అత‌డి కోసం ఫ్రాంచైజీలు పోటీప‌డ్డాయి. ధ‌ర పెరిగిపోవ‌డంతో మిగిలిన ఫ్రాంచైజీలు ప‌క్క‌కు త‌ప్పుకున్నాయి.

అయినప్ప‌టికీ ఈ ఆసీస్ కెప్టెన్ ను ద‌క్కించుకునేందుకు రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ నువ్వా నేనా అన్న‌ట్లుగా ధ‌ర‌ను పెంచుకుంటూ పోయాయి. చివ‌ర‌కు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ రూ.20.50కోట్ల‌కు క‌మిన్స్‌ను ద‌క్కించుకుంది. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే ఇదే అత్య‌ధిక ధ‌ర కావ‌డం గ‌మ‌నార్హం.

WI vs ENG 2nd T20 : సిక్స్ ఇలా కొట్టాల‌ని ఇన్ని రోజులు తెలియ‌దు భ‌య్యా..! వీడియో వైర‌ల్‌
కాగా.. 2018 ఐపీఎల్ వేలంలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండ‌ర్ సామ్‌క‌ర‌న్‌ను పంజాబ్ కింగ్ రూ.18.50 కోట్ల‌కు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ రికార్డును క‌మిన్స్ బ‌ద్ద‌లు కొట్టాడు.