CSK vs GT IPL 2023 : దటీజ్ ధోని.. ఒక్క మ్యాచ్ తో గుజరాత్ టైటాన్స్ ఖాతాలో చెత్త రికార్డులు
ధోని దెబ్బకు డిఫెండింగ్ చాంపియన్ చెత్త రికార్డులు నమోదు చేసుకుంది. ఐపీఎల్ టోర్నిలో ఇప్పటివరకు చెన్నైతో నాలుగు మ్యాచ్ లు ఆడిన గుజరాత్ మొదటిసారి పరాజయాన్ని చవిచూసింది.
- Naga Srinivasa Rao Poduri
- Published On : May 24, 2023 / 12:45 PM IST
చెన్నై సూపర్ కింగ్స్ (Photo @ChennaiIPL)
CSK vs GT – Dhoni : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఎంఎస్ ధోని (MS Dhoni) నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) సత్తా చాటింది. మంగళవారం చెన్నైలోని చెపాక్ స్టేడియం (chepauk stadium)లో జరిగిన క్వాలిఫయర్1 మ్యాచ్ లో లీగ్ టాపర్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ను ఓడించి ఫైనల్లోకి దూసుకుపోయింది. కీలక మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోని మరోసారి తన మార్క్ కెప్టెన్సీతో జట్టును విజయపథాన నడిపించాడు. ఐపీఎల్లో 10వ సారి జట్టును ఫైనల్లో నిలిపాడు. ఇప్పటివరకు 9 ఫైనల్స్ ఆడిన సీఎస్కే (CSK) 4 సార్లు విజేతగా, 5 పర్యాయాలు రన్నరప్ గా నిలిచింది.
గుజరాత్ తో జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్ లో ధోని కెప్టెన్సీ అందరినీ ఆకట్టుకుంది. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడేసేందుకు అతడు పన్నిన వ్యూహాలు ఫలిచడంతో చెన్నై విజయం సాధించింది. ముఖ్యంగా గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ధోని వ్యూహంలో చిక్కుకుని స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. హార్దిక్ పాండ్యా కేవలం 8 పరుగులు చేసి తీక్షణ బౌలింగ్ లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఫస్ట్ టైమ్ ఆలౌట్
ధోని దెబ్బకు డిఫెండింగ్ చాంపియన్ చెత్త రికార్డులు నమోదు చేసుకుంది. గతేడాది ఐపీఎల్ విజేతగా నిలిచిన గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్ లోనూ అద్భుతంగా ఆడింది. 10 మ్యాచ్ లు నెగ్గి 20 పాయింట్లతో లీగ్ టాపర్ గా ప్లేఆఫ్ కు చేరింది. అయితే క్వాలిఫయర్1 మ్యాచ్ లో సీఎస్కే చేతిలో ఓటమి ఎదురైంది. ఐపీఎల్ టోర్నిలో ఇప్పటివరకు చెన్నైతో నాలుగు మ్యాచ్ లు ఆడిన గుజరాత్ మొదటిసారి పరాజయాన్ని చవిచూసింది. అంతేకాదు హార్దిక్ సేన తొలిసారి ఆలౌట్ కావడం విశేషం.
రుతురాజ్ గైక్వాడ్ ఘనత
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అరుదైన ఘనత సాధించాడు. గుజరాత్ టైటాన్స్ పై 4 హాఫ్ సెంచరీలు సాధించిన సీఎస్కే బ్యాటర్ గా నిలిచాడు. ఇప్పటివరకు గుజరాత్ చెన్నై జట్ల మధ్య నాలుగు మ్యాచ్ లు జరగ్గా నాలుగుసార్లు అతడొక్కడే అర్ధసెంచరీలు బాదాడు. తాజా మ్యాచ్ లో 44 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్ తో 60 పరుగులు చేసి చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించాడు.
Q1 ? Man of the Match!
Just ? things ?#WhistlePodu #Yellove ?? pic.twitter.com/nSCGoAwJue— Chennai Super Kings (@ChennaiIPL) May 24, 2023
నేడు ఎలిమినేటర్ మ్యాచ్
ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల బుధవారం రాత్రి ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈరోజు ఓడిన జట్టు టోర్ని నుంచి వెళ్లిపోతుంది. గెలిచిన జట్టు శుక్రవారం అహ్మదాబాద్ లో జరిగే రెండో క్వాలిఫయర్ లో గుజరాత్ టైటాన్స్ తో తలపడుతుంది.
Also Read: బాబోయ్ ధోని క్రేజ్ మామూలుగా లేదు.. ఈ ఫొటోలు చూశారా?
