Dhoni Rare Photos: బాబోయ్ ధోని క్రేజ్ మామూలుగా లేదు.. ఈ ఫొటోలు చూశారా?

ధోనికి సంబంధించిన ఏదోక వార్త సోషల్ మీడియాలో నిత్యం కనబడుతూనే ఉంటుంది. తాజాగా మిస్టర్ కూల్ రేర్ ఫొటోలు ట్విటర్ లో ప్రత్యక్షమైయ్యాయి.

Dhoni Rare Photos: బాబోయ్ ధోని క్రేజ్ మామూలుగా లేదు.. ఈ ఫొటోలు చూశారా?

Dhoni Rare Photos

Dhoni Childhood Photos : సమకాలిన క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న క్రేజ్ అంతాఇంత కాదు. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అతడి పేరు మార్మోగిపోతోంది. అతడు ఎక్కడికి వెళ్లినా క్రికెట్ అభిమానులు (Cricket Fans) బ్రహ్మరథం పడుతున్నారు. మైదానంలో ఎంఎస్ ధోని (MS Dhoni) కనబడితే చాలు ప్రేక్షకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అంతలా క్రికెట్ లో ధోని తనదైన ముద్ర వేశాడు. ఇక ఈ సీజన్ తర్వాత ఐపీఎల్ (IPL) నుంచి ధోని రిటైర్ అవుతాడన్న చర్చ కూడా నడుస్తోంది.

ధోని అరుదైన ఫొటోలు
ఇదిలావుంటే ధోనికి సంబంధించిన ఏదోక వార్త సోషల్ మీడియా(Social Media)లో నిత్యం కనబడుతూనే ఉంటుంది. తాజాగా మిస్టర్ కూల్ రేర్ ఫొటోలు ట్విటర్ లో ప్రత్యక్షమైయ్యాయి. ధోని రేర్ ఫొటోలు షేర్ చేయమని ఒక అభిమాని కోరడంతో మహి అరుదైన ఫొటోలు ట్విటర్ లో చక్కర్లు కొడుతున్నాయి. ధోని చిన్ననాటి ఫొటోలు దగ్గర నుంచి స్నేహితులు, కుటుంబ సభ్యులు, వివిధ ఫంక్షన్లలో దిగిన ఫోటోలు కూడా వీటిలో ఉన్నాయి. తమ అభిమాన క్రికెటర్ కు సంబంధించిన అరుదైన ఫొటోలు చూసి ధోని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.


కాగా, ఈసారి ఐపీఎల్ కప్ కొట్టాలని చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కోరుకుంటున్నారు. ప్లే ఆఫ్ లో భాగంగా ఈరోజు జరిగే మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టుతో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో అడుగుపెడుతుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. చెన్నై సూపర్ కింగ్స్ 12వ సారి ప్లేఆఫ్ కు రావడం విశేషం.

Also Read: ధోనీకి హెలికాప్టర్ షాట్ నేర్పింది ఎవరో తెలుసా?

41 ఏళ్ల ధోని వచ్చే ఐపీఎల్ సీజన్ లో ఐపీఎల్ బరిలోకి దిగకపోవచ్చని చర్చ నడుస్తోంది. దీనిపై సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ (Stephen Fleming) స్పందించాడు. తనకు ఇదే చివరి సీజన్ అని ధోని ఎక్కడా చెప్పలేదని, టీమ్ యాజమాన్యానికి కూడా ఎలాంటి ఇండికేషన్ ఇవ్వలేదని చెప్పారు. అలాంటప్పుడు ధోని వచ్చే సీజన్ లో ఆడబోడని ఎలా చెబుతారని ఫ్లెమింగ్ ప్రశ్నించాడు. ధోని తనకు తానుగా ప్రకటన చేసే వరకు అతడి రిటైర్ మెంట్ పై ఊహాగానాలు ఆగేలా కనబడటం లేదు.

Also Read: వచ్చే సీజన్‌కు మరింత బలంగా తిరిగొస్తాం.. ఆర్‌సీబీ ఓటమిపై విరాట్ కోహ్లీ ఎమోషనల్ పోస్ట్..