MS Dhoni : ధోనీకి హెలికాప్టర్ షాట్ నేర్పింది ఎవరో తెలుసా?

ధోనీ హెలికాప్టర్ షాట్‌తో ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. అయితే ఇంతకాలం ఆ షాట్ ధోని కనిపెట్టాడు అని అంతా అనుకున్నారు. కానీ సంతోష్ లాల్ అనే వ్యక్తి ధోనికి ఈ షాట్ నేర్పాడట. ఇంతకీ ఎవరా సంతోష్ లాల్?

MS Dhoni : ధోనీకి హెలికాప్టర్ షాట్ నేర్పింది ఎవరో తెలుసా?

MS Dhoni

Dhoni’s helicopter shot : CSK కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హెలికాప్టర్ షాట్ ఆవిష్కర్తగా అందరికి తెలిసిందే. అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ హెలికాప్టర్ షాట్‌ను ధోనీ కనిపెట్టలేదు. సంతోష్ లాల్ కనిపెట్టారట. ఆయన ఎవరు?

An old man looks like Dhoni : ధోనీ ఏంటి ఇలా అయిపోయాడు?

ధోనీ హెలికాప్టర్ షాట్‌తో చాలా ఫేమస్. ధోనీ ఆ షాట్‌ని కనిపెట్టారు అని అంతా ఇప్పటివరకూ అనుకున్నారు. కానీ ధోని వరకు ఆ షాట్‌ని కనిపెట్టింది అతని బెస్ట్ ఫ్రెండ్ సంతోష్ లాల్. అయితే అతను ఇప్పుడు లేరు. సంతోష్ లాల్ కూడా క్రికెటరేనట. ధోనీతో ఉన్నప్పుడు కలిసి మ్యాచ్‌లు కూడా ఆడారట. కానీ సంతోష్ లాల్‌కి కుటుంబ బాధ్యతలు ఎక్కువ ఉండటంతో క్రికెట్ వైపు రాలేదట. ధోనీ మాత్రం టీం ఇండియా కోసం ఆడాలని సంతోష్ లాల్ ఎప్పుడూ కలలు కనేవారట. అయితే సంతోష్ లాల్ ప్రాంక్రియా‌టైటిస్ కారణంగా తీవ్ర అనారోగ్య ఇబ్బందులు ఎదుర్కున్నారట. అలా 2013 లో సంతోష్ లాల్ చనిపోయారు.

ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ధోనీ

ఆ సమయంలో ధోనీ ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేసి రాంచీ నుంచి ఢిల్లీలోని ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నం చేశారు. ఎయిర్ అంబులెన్స్ వారణాశిలో నిలిపేశారు. సంతోష్ లాల్ ఢిల్లీ చేరుకునేలోపు మరణించారు. ఏది ఏమైనా ధోనీ ప్రకారం హెలికాప్టర్ షాట్‌ను కనుకొన్నది మాత్రం సంతోష్ లాల్. ఈ విషయాన్ని ధోని బయోపిక్ ‘MS ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరి’లో చూపించారు. సంతోష్ లాల్ పాత్రను క్రాంతి ప్రకాష్ ఝా పోషించారు.