Cricket Australia announced squad for T20 World Cup 2026 Pat Cummins out
T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభం కానుంది. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఈ మెగాటోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. తాజాగా ఈ మెగాటోర్నీలో పాల్గొనే తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. 15 మంది సభ్యులు గల బృందాన్ని టోర్నీకి ఎంపిక చేసింది. ఈ జట్టుకు మిచెల్ మార్ష్ సారథ్యం వహించనున్నాడు.
స్టార్ పేసర్ పాట్ కమిన్స్ వెన్నుగాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో అతడిని ఈ టోర్నీకి ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో బెన్ డ్వార్షుయిస్‌ను జట్టులోకి తీసుకున్నట్లు సెలక్టర్లు తెలిపారు. మరో సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ కు చోటు దక్కలేదు. గ్లెన్ మాక్స్‌వెల్, ఆడమ్ జంపాలు స్థానాలను దక్కించుకున్నారు.
WPL 2026 : గుజరాత్ చేతిలో ఓడిపోయినా.. ప్లేఆఫ్స్‌కు చేరేందుకు ముంబైఇండియన్స్‌కు గోల్డెన్ ఛాన్స్!
కమిన్స్ అందుబాటులో లేకపోవడంపై ఆస్ట్రేలియా సెలెక్టర్ టోనీ డోడెమైడ్ స్పందించాడు. కమిన్స్ గాయం నుంచి కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందన్నాడు. అందుకనే డ్వార్షుయిస్ ను జట్టులోకి తీసుకున్నామని చెప్పుకొచ్చాడు. డ్వార్షుయిస్ ఎడమ చేతి వాటం పేసర్ అని, మంచి వేగంతో బంతిని స్వింగ్ చేయగల సామర్థ్యం అతడి సొంతం అని తెలిపాడు. మొత్తానికి తాము ఎంపిక చేసిన జట్టు సమతూకంగా ఉందని, కప్పును ముద్దాడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.
WORLD CUP SQUAD 🔒
Mitch Marsh will lead our Aussie men’s team at the upcoming #T20WorldCup in India and Sri Lanka. pic.twitter.com/DlIaxxnMnG
— Cricket Australia (@CricketAus) January 31, 2026
టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు ఇదే..
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాట్ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్ , మాట్ రెన్షా, మార్కస్ స్టోయినిస్ , ఆడమ్ జంపా