Cristiano Ronaldo: క్రిస్టియానో రోనాల్డో భారీ ఒప్పందం.. రోజుకు, నిమిషానికి ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?
అతడు అల్-నసర్ ఫుట్‌బాల్ క్లబ్ తో ఎంత వేతనానికి ఒప్పందం కుదుర్చుకున్నాడో తెలుసా? అక్షరాలా రూ.1,722 కోట్లు (ఏడాదికి). అందులో రూ.617 కోట్లు మైదానంలో ఆడడానికి, మిగతా రూ.1,105 కోట్లు కమర్షియల్ ఒప్పందాలు, ఇమేజ్ రైట్స్ కు సంబంధించినవి. 2025, జూన్ 25 వరకు ఆ క్లబ్ తరఫున క్రిస్టియానో రోనాల్డో ఆడనున్నాడు. దాని తరఫున ఆడుతూ కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టనున్నాడు. ఈ ఒప్పందంతో క్రిస్టియానో రోనాల్డో ప్రపంచంలో అత్యధిక వేతనం తీసుకుంటున్న ఆటగాడిగా నిలిచాడు.
- T Venkateshwarlu
- Published On : January 2, 2023 / 08:18 PM IST
Cristiano Ronaldo
Cristiano Ronaldo: క్రిస్టియానో రోనాల్డో.. పోర్చుగల్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న క్రీడాకారుడు. ఈ సాకర్ సూపర్ స్టార్ తాజాగా సౌదీ అరేబియాకు చెందిన అల్-నసర్ ఫుట్‌బాల్ క్లబ్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. రియాద్ లో జరిగిన కార్యక్రమంలో అల్-నసర్ ఫుట్‌బాల్ క్లబ్ అధికారుల సమక్షంలో సంతకం చేసి, అనంతరం తన జెర్సీతో ఫొటోకు పోజులు ఇచ్చాడు.
ఇంతకీ అతడు అల్-నసర్ ఫుట్‌బాల్ క్లబ్ తో ఎంత వేతనానికి ఒప్పందం కుదుర్చుకున్నాడో తెలుసా? అక్షరాలా రూ.1,722 కోట్లు (ఏడాదికి). అందులో రూ.617 కోట్లు మైదానంలో ఆడడానికి, మిగతా రూ.1,105 కోట్లు కమర్షియల్ ఒప్పందాలు, ఇమేజ్ రైట్స్ కు సంబంధించినవి. 2025, జూన్ 25 వరకు ఆ క్లబ్ తరఫున క్రిస్టియానో రోనాల్డో ఆడనున్నాడు. దాని తరఫున ఆడుతూ కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టనున్నాడు. ఈ ఒప్పందంతో క్రిస్టియానో రోనాల్డో ప్రపంచంలో అత్యధిక వేతనం తీసుకుంటున్న ఆటగాడిగా నిలిచాడు.
గతంలో జువెంటస్, మాంచెస్టర్ యూనైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ ల తరఫున క్రిస్టియానో రోనాల్డో ఆడాడు. జువెంటస్ (2018-21) తరఫున ఆడే సమయంలో అతడు రూ.248 కోట్లతో, మాంచెస్టర్ యునైటెడ్ (2021-22) తరఫున ఆడే సమయంలో రూ.199 కోట్లతో ఒప్పందాలు చేసుకున్నాడు. ఇప్పుడు అతడితో అల్ నసర్ క్లబ్ ఏకంగా రూ.1,722 కోట్లతో ఒప్పందం చేసుకుంది. రోనాల్డో నెలకు రూ.143 కోట్లు, రోజుకు దాదాపు రూ.5 కోట్లు, వారానికి రూ.35 కోట్లు, గంటకు రూ.21 లక్షలు, నిమిషానికి రూ.35 వేలు, ఒక్క క్షణానికి రూ.597 సంపాదిస్తున్నాడు.
Kodali Nani : యమరథంతో ప్రజలను చంపుతున్నారు- చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డ కొడాలి నాని
