Kodali Nani : యమరథంతో ప్రజలను చంపుతున్నారు- చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డ కొడాలి నాని

చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. యమ రథంతో చంద్రబాబు ప్రజలను చంపుతున్నారని విమర్శించారు కొడాలి నాని. ఇటీవల కాలంలో కందుకూరులో 8 మంది, గుంటూరులో ముగ్గురిని చంద్రబాబు బలిగొన్నారని అన్నారు.

Kodali Nani : యమరథంతో ప్రజలను చంపుతున్నారు- చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డ కొడాలి నాని

Kodali Nani : గుంటూరు తొక్కిసలాట ఘటన కలకలం రేపింది. రాజకీయ రంగు పులుముకుంది. అధికార పక్షం వైసీపీ.. టీడీపీని, చంద్రబాబుని టార్గెట్ చేసింది. వైసీపీ నేతలు చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారు. చంద్రబాబు తన పబ్లిసిటీ పిచ్చితో అమాయక ప్రజలను చంపుతున్నారని ధ్వజమెత్తారు.

ఈ క్రమంలో చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. యమ రథంతో చంద్రబాబు ప్రజలను చంపుతున్నారని విమర్శించారు కొడాలి నాని. ఇటీవల కాలంలో కందుకూరులో 8 మంది, గుంటూరులో ముగ్గురిని చంద్రబాబు బలిగొన్నారని అన్నారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలైపోతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు బహిరంగ సభలకు అనుమతి ఇవ్వకూడదని కొడాలి నాని డిమాండ్ చేశారు.

”ఇవన్నీ కూడా 420 ప్రోగ్రామ్ లు. ఎవరో ఒకరు ఎన్ ఆర్ఐ బకరాను పట్టుకురావడం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేస్తోందని చెప్పడం, వాళ్లకి ఎవరికో ఒకరికి నాలుగైదు సీట్లు ఇస్తామని చెప్పడం, వాళ్లు వచ్చి బట్టలు పంచడం, కిలో 200, 300 రూపాయల చీరలు, అర కేజీ పప్పు, ఉప్పు, పంచదార, బెల్లం దేనికి పనికొస్తాయి. ఒక నెల రోజులకు సరిపోతాయా? ఒక 10 రోజులకు సరిపోయే కానుకలా? పబ్లిసిటీ పిచ్చితో ఇంత మందిని చంపే కార్యక్రమం ఇది.

ఇది పోలీసుల వైఫల్యం కాదు, ప్రభుత్వ వైఫల్యం కాదు..నూటికి నూరుపాళ్లు చంద్రబాబుకి పట్టిన పిచ్చి. చంద్రబాబు 75 సంవత్సరాల వయసులో మళ్లీ అధికారంలోకి రాకపోతే ఈ తెలుగుదేశం పార్టీ ఉండదు. అతడి కొడుకు దేనికీ పనికి రాడు. వాడికి రాజకీయ భవిష్యత్తు ఉండదు. కాబట్టి ఏదో ఒక విధంగా జనాలను మభ్య పెట్టి పబ్లిసిటీ చేసుకుని అధికారంలోకి వచ్చేస్తున్నా అని బిల్డప్ ఇస్తున్నాడు.

ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా బలైపోతున్నారు. ఎన్ ఆర్ ఐలు కూడా బలైపోయేటటువంటి కార్యక్రమం” అని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు కొడాలి నాని.