స్వదేశానికి సురేష్ రైనా.. చెన్నై కింగ్స్ మీద పిడుగుపడింది

  • Publish Date - August 29, 2020 / 02:20 PM IST

Chennai Super Kings’ Suresh Raina: యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే ఐపిఎల్ -2020 లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్ మాన్ సురేష్ రైనా ఆడట్లేదు. అతను వ్యక్తిగత కారణాల వల్ల యూఏఈ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కె.ఎస్.విశ్వనాథన్ ఈ మేరకు ట్వీట్ చేశారు ఐపీఎల్ మొత్తం సీజన్‌లో అతను ఆడట్లేదని ఆయన వెల్లడించారు.



ఈ సంధర్భంగా విశ్వనాథన్ ట్వీట్ చేస్తూ.. చెన్నై సూపర్కింగ్స్ బ్యాట్స్ మాన్ సురేష్ రైనా మరియు అతని కుటుంబానికి మద్దతుగా ఉంది. అయితే రైనా వెనక్కి ఎందుకొచ్చాడన్నదానిపై సీఎస్‌కే స్పష్టత ఇవ్వలేదు. ఐపీఎల్ 2020 టైటిల్ రేసులో ఫేవరెట్‌గా ఉన్న చెన్నై సూపర్‌కింగ్స్ టోర్నీ ప్రారంభానికి ముందే సురేష్ రైనా దూరం కావడంతో ఆ టీమ్‌కు షాక్ తగిలినట్లుగా అయ్యింది.
https://10tv.in/ipl-2020-1-chennai-super-kings-player-12-support-staff-members-test-coronavirus-positive/
సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు ఐపీఎల్ జరగనుంది. అన్ని జట్లు ఇప్పటికే యూఏఈ చేరుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్ళు తప్ప మిగిలిన ఆటగాళ్లంతా ప్రాక్టీస్ చేస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడికి కరోనా వైరస్ సోకగా.. జట్టులోని 12 మంది సహాయక సిబ్బందికి కూడా వైరస్ ఉన్నట్లుగా గుర్తించారు. కరోనా కేసు తరువాత, బృందం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయింది. కాగా, ఇటీవలే సురేశ్ రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా గుడ్‌ బై చెప్పారు.