CWG 2026 : శెభాష్ బిడ్డా.. పేరు నిలబెట్టావ్.. తండ్రిని మించిన తనయుడు.. కామన్వెల్త్ గేమ్స్‌లో తెలుగు కుర్రాడికి రజతం
కామన్వెల్త్ గేమ్స్ 2026లో (CWG 2026) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ వెయిట్‌లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబు పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 79 కేజీల విభాగంలో రజత పతకం సాధించాడు.
- Thota Vamshi Kumar
- Updated on- July 28, 2026 / 08:44 AM IST
CWG 2026 Valluri Ajaya babu won silver in weightlifting
CWG 2026 : స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో మెయిట్ లిఫ్టింగ్‌లో భారత అథ్లెట్లు తమ జోరు కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ వెయిట్‌లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబు పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 79 కేజీల విభాగంలో రజత పతకం సాధించాడు.
సోమవారం రాత్రి జరిగిన పోటీల్లో విజయనగరం జిల్లా కొండవెలగాడ గ్రామానికి చెందిన 21 ఏళ్ల అజయ్.. మొత్తం 330 కిలోలు (స్నాచ్‌లో 149 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 181 కిలోలు) ఎత్తాడు. కేవలం ఒక్క కిలో తేడాతో స్వర్ణ పతకాన్ని చేజార్చుకున్నాడు. మలేషియాకు చెందిన హిదాయత్ మహమ్మద్ 331 కిలోలతో స్వర్ణాన్ని గెలుచుకున్నాడు. ఇంగ్లాండ్‌కు చెందిన క్రిస్ ముర్రే 325 కిలోలతో కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.
Suryakumar Yadav : నెక్ట్స్ లెవెల్‌లో సూర్యకుమార్ యాదవ్ ప్రాక్టీస్.. 3 గంటల్లో 1000 బంతులు..
Sheer strength on show! 🥈
Many congratulations to Khelo India athlete Valluri Ajaya Babu on winning the Silver Medal in the Men’s 79kg Weightlifting.
With a total lift of 330kg, he also set a Commonwealth Games record in the Snatch. A memorable performance and another proud… pic.twitter.com/GMCQPQtIvm
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 28, 2026
అజయ్ సాధించిన పతకంతో కామన్వెల్త్ గేమ్స్ 2026లో వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో భారత్‌కు ఆరో పతకం కావడం విశేషం.
నాడు తండ్రి.. నేడు కొడుకు..
విజయనగరం జిల్లా కొండవెలగాడ గ్రామానికి చెందిన అజయ్ బాబు తండ్రి వల్లూరి శ్రీనివాసరావు మాజీ అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టర్. ఆయన 2010 ఢిల్లీ కామన్వెల్త్ క్రీడల్లో 56 కేజీల విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్నారు. తండ్రి అడుగుజాడల్లో నడిచిన అజయ్ బాబు ఇప్పుడు కామన్వెల్త్ వేదికపై ఒక మెట్టు పైకి ఎక్కి రజత పతకాన్ని సాధించాడు.
అజయ్ బాబు గత కొన్నేళ్లుగా అద్భుత ప్రదర్శనతో అంతర్జాతీయ స్థాయిలో వేగంగా ఎదుగుతున్నాడు. 2025 అహ్మదాబాద్‌లో జరిగిన కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో 335 కిలోల వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో స్వర్ణం గెలిచి గ్లాస్గోకు అర్హత సాధించాడు. అంతకుముందు 2024 ఫిజీ కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో జూనియర్, సీనియర్ విభాగాల్లో డబుల్ గోల్డ్ సాధించాడు.
#CWG2026 | “It is a mix of happiness and sadness, as I missed out on the gold,” says Indian weightlifter Valluri Ajaya Babu after winning silver in the men’s 79kg event at the 2026 Commonwealth Games in Glasgow with a total lift of 330kg
(Source: ANI) pic.twitter.com/TrdIiENBLL
— WION (@WIONews) July 28, 2026
స్వర్ణ పతకం కేవలం ఒక్క కిలో తేడాతో చేజారినా, అజయ్ బాబు సాధించిన రజతం భారత వెయిట్‌లిఫ్టింగ్‌కు మరో గర్వకారణంగా నిలవడంతో పాటు, తండ్రి నుంచి కుమారుడికి కొనసాగిన క్రీడా వారసత్వాన్ని మరింత గొప్పగా చాటిచెప్పింది.
