Suryakumar Yadav : నెక్ట్స్ లెవెల్లో సూర్యకుమార్ యాదవ్ ప్రాక్టీస్.. 3 గంటల్లో 1000 బంతులు..
భారత టీ20 జట్టు కెప్టెన్సీని కోల్పోయి, జట్టు నుంచి తొలగించబడి ఎదురుదెబ్బ తగిలినా, స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav ) ఆశ వదులుకోలేదు.
Suryakumar Yadav practice 1000 balls faces in 3 hours
Suryakumar Yadav : భారత టీ20 జట్టు కెప్టెన్సీని కోల్పోయి, జట్టు నుంచి తొలగించబడి ఎదురుదెబ్బ తగిలినా, స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఆశ వదులుకోలేదు. టీమ్ ఇండియాలోకి బలంగా పునరాగమనం చేసేందుకు అతను ప్రస్తుతం మైదానంలో కఠోరంగా శ్రమిస్తున్నాడు. నెట్స్‌లో గంటల తరబడి పరుగెత్తుతూ, చెమటలు చిందిస్తున్న తన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీలైనంత త్వరగా టీమ్ ఇండియాలోకి తిరిగి రావడానికి సూర్య ప్రతీ అవకాశాన్ని వదులుకోవడం లేదు.
ఈ వీడియోలో.. సూర్యకుమార్ యాదవ్ రన్నింగ్ ట్రాక్‌పై పరుగెడుతూ తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. తన పాత లయను తిరిగి పొందడానికి నెట్ సెషన్లో భారీ షాట్లు కొడుతూ కూడా కనిపించాడు. 3 గంటల్లో 1000 బంతులను ఎదుర్కొన్నట్లుగా చెప్పుకొచ్చాడు.
Sunday was fun. Quick run 🏃🏾
Batted around 1000 balls for 3 hours.
Felt good 💪 pic.twitter.com/x6wH9Ebpmv— Surya Kumar Yadav (@surya_14kumar) July 26, 2026
ఆదివారం సరదాగా గడిచింది. త్వరగా పరుగు తీసి, దాదాపు 3 గంటల పాటు 1000 బంతులు ఎదుర్కొని బ్యాటింగ్ చేశాను. చాలా గొప్పగా అనిపించింది. అని ఆ వీడియో కింద సూర్య రాసుకొచ్చాడు.
