MS Dhoni : ద‌క్షిణాఫ్రికాలోనూ ధోని ఫీవ‌ర్ ఉందా? నిజాన్ని చెప్పిన డేల్ స్టెయిన్‌

టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ ప్లేయ‌ర్ ఎంఎస్ ధోనికి ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

MS Dhoni – Dale Steyn : టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ ప్లేయ‌ర్ ఎంఎస్ ధోనికి ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అత‌డు అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయి దాదాపు నాలుగు సంవ‌త్స‌రాలు కావొస్తున్న‌ప్ప‌టికీ కూడా అత‌డి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు స‌రిక‌దా మ‌రింత పెరిగింది. ధోనిని అభిమానించే వాళ్ల‌లో సామాన్య ప్ర‌జ‌లే కాదు స్టార్ క్రికెట‌ర్లు సైతం ఉన్నారు.

ఐపీఎల్ 2024 సీజ‌నే ధోనికి చివ‌రి సీజ‌న్ అని ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో అత‌డిని చూసేందుకు అభిమానులు స్టేడియానికి పోటెత్తుతున్నారు. మైదానంలో ప్ర‌త్య‌క్షంగా వీక్షించ‌లేని ఎంతో మంది టీవీలు, మొబైల్ ఫోన్ల‌కు అతుక్కుపోతున్నారు. అందులో ద‌క్షిణాప్రికా మాజీ క్రికెట‌ర్ డేల్ స్టెయిన్ సైతం ఉన్నాడు. ఈ విష‌యాన్ని అత‌డే స్వ‌యంగా వెల్ల‌డించాడు.

Mohammad Nabi : హార్దిక్ పాండ్య‌పై న‌బీ అసంతృప్తి..! ఇన్‌స్టా పోస్ట్ వైర‌ల్‌

జియో సినిమాతో డేల్ స్టెయిన్ మాట్లాడుతూ.. భార‌త్‌లోనే కాదు ద‌క్షిణాప్రికాలోనూ ఐపీఎల్ ఫీవ‌ర్ ఉంది. నిజాయితీగా చెప్పాలంటే నేను టీవీ ఎక్కువ‌గా చూడ‌ను. అయితే.. ఐపీఎల్ స‌మ‌యంలో మాత్రం టీవీకి అతుక్కుపోతుంటాను. ఆ స‌మ‌యంలో నా టీవీ ప‌గిలిపోతుంద‌ని అని నా స్నేహితురాలు న‌న్ను ఏడిపిస్తూ ఉంటుంది. గ‌త రాత్రి ఎంఎస్ ధోని విన్యాసాల‌ను చూశాను. అని డేల్ స్టెయిన్ తెలిపాడు.

ధోని ఆడేతీరును గ‌తంలో ఆట‌గాడిగా చూసేవాడిని, ప్ర‌స్తుతం అభిమానుల కోణం నుంచి చూస్తున్నాను. ధోని ఆడే ప్ర‌తి షాట్ ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ధోని కాస్త ముందుగా బ్యాటింగ్ వ‌స్తే చాలా బాగుంటుంది. అత‌డు మ‌రిన్ని సీజ‌న్లు ఆడితే బాగుంటుంద‌ని అని స్టెయిన్ అన్నాడు.

Tilak Varma : తెలుగు కుర్రాడి మంచి మ‌న‌సు.. ముంబై త‌రుపున ఆడుతూ.. పంజాబ్ కింగ్స్‌కు మ‌ద్దతుగా వ‌చ్చిన అమ్మాయిల‌కు..

ట్రెండింగ్ వార్తలు