×
Ad

T20 World Cup 2026 : జింబాబ్వే చేతిలో ఓట‌మిపై స్పందించిన శ్రీలంక కెప్టెన్.. నిజం చెప్పాలంటే

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో (T20 World Cup 2026) జింబాబ్వే చేతిలో ఓట‌మిపై శ్రీలంక కెప్టెన్ దాసున్ శనక స్పందించాడు.

T20 World Cup 2026 Dasun Shanaka comments after Sri Lanka lost match to Zimbabwe

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో శ్రీలంక‌కు షాక్..
  • జింబాబ్వే చేతిలో ఓట‌మి
  • ఓట‌మి పై స్పందించిన లంక కెప్టెన్ దాసున్ శ‌న‌క‌

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో శ్రీలంక‌కు భారీ షాక్ త‌గిలింది. గురువారం ప్రేమ‌దాస స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓట‌మిని చ‌విచూసింది. ఈ ఓట‌మిపై శ్రీలంక కెప్టెన్ దాసున్ శనక స్పందించాడు. బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో విఫ‌లం కావ‌డంతోనే ఓడిపోయామ‌ని చెప్పుకొచ్చాడు. ఈ పిచ్ పై 178 ప‌రుగులు కాపాడుకోవ‌చ్చున‌ని అన్నాడు.

‘నిజం చెప్పాలంటే మాకు మంచి ఆరంభం ల‌భించింది. ఈ పిచ్ పై మేము సాధించిన స్కోరు డిఫెండ్ చేసేందుకు స‌రిపోతుంది. పాతుమ్ నిస్సాంక‌, ప‌వ‌న్ ర‌త్నాయ‌కే చాలా బాగా ఆడారు. ఇక బౌలింగ్‌లో ఆరంభంలో వికెట్లు ప‌డ‌గొట్ట‌డంలో విఫ‌లం అయ్యాము. ఇదే మా కొంప‌ముంచింది. కొత్త ప్లేయ‌ర్లు జ‌ట్టులోకి వ‌చ్చిన‌ప్పుడు వారు స్థిర‌ప‌డేందుకు కొంచెం స‌మ‌యం ప‌డుతుంది.

Harmanpreet Kaur : అందువ‌ల్లే ఆసీస్ చేతిలో ఓడిపోయాం.. లేదంటేనా.. హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ కామెంట్స్ వైర‌ల్

చ‌మీరాకు విశ్రాంతి ఇచ్చాము. మా ఫీల్డింగ్ కూడా పేల‌వంగా ఉంది. అయితే.. ఇవ‌న్నీ ఓట‌మికి సాకులుగా చెప్ప‌డం లేము. ఓడిపోవ‌డం నిరాశ క‌లిగించింది. ఇలా జ‌రుగుతుంద‌ని అస‌లు అనుకోలేదు. నిజం చెప్పాలంటే జింబాబ్వే చాలా బాగా ఆడింది. ఇక‌ ఈ మ్యాచ్ ఓట‌మి నుంచి పాఠాలు నేర్చుకుంటాము. సూప‌ర్-8లో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేసేందుకు ప్ర‌య‌త్నిస్తాము. మొత్తంగా జ‌ట్టు ఆడిన విధానం ప‌ట్ల సంతోషంగా ఉంది.’ అని శ్రీలంక కెప్టెన్ దాసున్ శ‌న‌క అన్నాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన‌ శ్రీలంక జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 178 ప‌రుగులు చేసింది. లంక బ్యాట‌ర్ల‌లో పాతుమ్ నిస్సాంక (62; 41 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్ సెంచ‌రీ చేయ‌గా ప‌వ‌న్ ర‌త్నాయ‌కే (44; 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) రాణించాడు. జింబాబ్వే బౌల‌ర్ల‌లో బ్లెస్సింగ్ ముజారబానీ, బ్రాడ్ ఎవాన్స్, గ్రేమ్ క్రీమర్ లు త‌లా రెండు వికెట్లు తీశారు. ర్యాన్ బర్ల్ ఓ వికెట్ సాధించాడు.

Saina Nehwal : మినీ స్క‌ర్ట్ లో సైనా నెహ్వాల్ వ‌య్యారాలు..

ఆ త‌రువాత బ్రియాన్ బెన్నెట్ (63నాటౌట్; 48 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్ సెంచ‌రీ చేయ‌గా కెప్టెన్ సికింద‌ర్ రజా (45; 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడ‌డంతో 179 ప‌రుగుల ల‌క్ష్యాన్ని జింబాబ్వే 19.3 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి అందుకుంది.