David Warner : ఏమ‌య్యా వార్న‌ర్.. ఎటు పోతున్న‌వ్..? అరె నీకే చెప్పేది..!

ఆస్ట్రేలియా దిగ్గ‌జ ఆట‌గాడు డేవిడ్ వార్న‌ర్ త‌న కెరీర్‌లో ఆఖ‌రి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఆడుతున్నాడు.

David Warner Hilarious Wrong Turn Has Fans In Stitches

Warner : ఆస్ట్రేలియా దిగ్గ‌జ ఆట‌గాడు డేవిడ్ వార్న‌ర్ త‌న కెరీర్‌లో ఆఖ‌రి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఆడుతున్నాడు. ఒమ‌న్‌తో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. అయితే.. వార్న‌ర్ ఔటైన త‌రువాత చేసిన పని ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోను ఐసీసీ పోస్ట్ చేయ‌డం విశేషం. ప్ర‌పంచ వ్యాప్తంగా వార్న‌ర్ ఎంతో క్రికెట్ ఆడాడు. ఈ కార‌ణంతో అత‌డిని క్ష‌మించేద్దాం అంటూ ఆ వీడియో కింద రాసుకొచ్చింది.

బార్బ‌డోస్ వేదిక‌గా ఒమ‌న్‌తో గురువారం ఆస్ట్రేలియా త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్ల న‌ష్టానికి 164 ప‌రుగులు చేసింది. మార్క‌స్ స్టోయినిస్ (36 బంతుల్లో 67 నాటౌట్‌), డేవిడ్ వార్న‌ర్ (51 బంతుల్లో 56) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. ఒమ‌న్ బౌల‌ర్ల‌లో మెహ్రన్‌ఖాన్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో ఒమ‌న్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో తొమ్మిది వికెట్లు కోల్పోయి 129 ప‌రుగులు చేసింది. దీంతో ఆసీస్ 39 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని సాధించింది. అయాన్ ఖాన్ (30 బంతుల్లో 36) ఫ‌ర్వాలేద‌నిపించారు. ఆసీస్ బౌల‌ర్ల‌లో మార్క‌స్ స్టోయినిస్ మూడు వికెట్లు తీశాడు.

IND vs PAK : భార‌త్‌-పాక్ మ్యాచ్ వేదిక‌ను మారుస్తారా..?

వార్న‌ర్ ఏం చేశాడంటే..?

ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఇన్నింగ్స్ ఆరంభంలో త‌డ‌బ‌డింది. 50 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శ‌లో జ‌ట్టును డేవిడ్ వార్న‌ర్‌, మార్క‌స్ స్టోయినిస్‌లు ఆదుకున్నాడు. వీరిద్ద‌రు నాలుగో వికెట్‌కు 102 ప‌రుగులు జోడించారు. అనంత‌రం ఖ‌లీముల్లా వేసిన‌ 19వ ఓవ‌ర్ ఆఖ‌రి బంతికి వార్న‌ర్ ఔట‌య్యాడు. ఖ‌లీముల్లా దూకుడుగా సంబ‌రాలు చేసుకోగా.. వార్న‌ర్ నిరాశ‌గా పెవిలియ‌న్ వైపుకు వెళ్లాడు.

త‌న మ‌న‌సు మొత్తం ఆట‌పైనే ఉండ‌డంతో వార్న‌ర్ తాను ఎటు వైపు వెలుతున్నానో కూడా చూసుకోలేదు. ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్ వైపు కాకుండా ఒమ‌న్ డ్రెస్సింగ్ రూమ్ మెట్ల ద‌గ్గ‌రికి చేరుకున్నాడు. అత‌డిని గ‌మ‌నించిన కొంద‌రు వార్న‌ర్ అటు కాదు ఇటు అటు సూచించారు. త‌న త‌ప్పును గ్ర‌హించిన వార్న‌ర్ ఆసీస్ డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లాడు. ఈ వీడియోను ఐసీసీ పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు.

IND vs IRE : బెస్ట్ ఫీల్డ‌ర్ అవార్డులో సూప‌ర్ ట్విస్ట్‌.. ఆశ్చ‌ర్య‌పోయిన రోహిత్ శ‌ర్మ‌, కోహ్లి.. వీడియో వైర‌ల్‌

ట్రెండింగ్ వార్తలు