IND vs PAK : భార‌త్‌-పాక్ మ్యాచ్ వేదిక‌ను మారుస్తారా..?

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో భార‌త్ శుభారంభం చేసింది.

IND vs PAK : భార‌త్‌-పాక్ మ్యాచ్ వేదిక‌ను మారుస్తారా..?

ICC stands firm on New York despite India pitch fears

India vs Pakistan : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో భార‌త్ శుభారంభం చేసింది. న్యూయార్క్ వేదికగా నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. టీమ్ ఇండియా బౌల‌ర్ల‌లో హార్దిక్ పాండ్య మూడు వికెట్లు తీశాడు. బుమ్రా, అర్షదీప్ సింగ్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అనంతరం భారత్ 12.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ (37 బంతుల్లో 52) హాఫ్ సెంచ‌రీ బాదాడు.

కాగా.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను కూడా భార‌త్ ఇదే స్టేడియంలో ఆడ‌నుంది. అయితే.. ఈ పిచ్ పై ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. మ్యాచ్ వేదిక‌ను మార్చాల‌ని డిమాండ్లు వినిపిస్తున్నాయి. నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలోని డ్రాప్ ఇన్ పిచ్‌లపై అస్థిర బౌన్స్ లభిస్తోంది. బ్యాటర్లు పరుగులు చేసేందుకు క‌ష్ట‌ప‌డుతున్నారు. అస్థిర బౌన్స్ కార‌ణంగా బ్యాట‌ర్ల‌కు గాయాలు అవుతున్నాయి. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ గాయ‌పడ్డాడు. దీంతో దాయాదుల పోరు ఫ‌లితం ఎలా ఉంటుందోన‌ని ఆందోళ‌న నెల‌కొంది.

Marcus Stoinis : మార్క‌స్ స్టోయినిస్ విధ్వంసం.. 6,6,6,6..

ఈ క్ర‌మంలో ఐసీసీ స్పందించింది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మ్యాచ్‌ను న్యూయార్క్‌లోని స్టేడియం నుంచి త‌ర‌లించే అవ‌కాశం లేద‌ని తేల్చి చెప్పిన‌ట్లుగా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. జూన్ 9న జ‌రిగే భార‌త్-పాక్ మ్యాచ్ కోసం ఇప్ప‌టి వ‌ర‌కు ఉప‌యోగించిన పిచ్‌లు కాకుండా కొత్త పిచ్‌ను ఉప‌యోగించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. అయితే.. మిగిలిన పిచ్‌ల‌పై మ్యాచ్‌ల ఫ‌లితాల‌ను బ‌ట్టి నిర్ణ‌యం ఉంటుంద‌ని ఐసీసీ అధికారులు చెప్పిన‌ట్లు ప‌లు రిపోర్టులు వ‌చ్చాయి.

10 గ్రాస్ పిచ్‌లు..

న్యూయార్క్ స్టేడియంలో మొత్తం 10 ట‌హోమా గ్రాస్ పిచ్‌లు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో పెరిగే గ‌డ్డిని స‌ముద్ర మార్గంలో ఫ్లోరిడాకు తీసుకువ‌చ్చారు. అక్క‌డి నుంచి ట్ర‌క్కుల్లో న్యూయార్క్‌కు త‌ర‌లించారు. పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ ఆరంభం కావ‌డానికి కొన్ని వారాల ముందు ఈ డ్రాప్ ఇన్ పిచ్‌ల ఏర్పాటు చేశారు. ఈ పిచ్‌కు ఫాస్ట్ బౌలింగ్‌కు స‌హ‌క‌రిస్తున్న‌ప్ప‌టికీ అస్థిర బౌన్స్‌తో బ్యాట‌ర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

T20 World Cup 2024 : 43 ఏళ్ల వ‌య‌సులో చ‌రిత్ర సృష్టించిన ఉగాండా బౌల‌ర్‌..