T20 World Cup 2024 : 43 ఏళ్ల వ‌య‌సులో చ‌రిత్ర సృష్టించిన ఉగాండా బౌల‌ర్‌..

పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో ఉగాండా బౌల‌ర్ చ‌రిత్ర సృష్టించాడు.

T20 World Cup 2024 : 43 ఏళ్ల వ‌య‌సులో చ‌రిత్ర సృష్టించిన ఉగాండా బౌల‌ర్‌..

Aged 43 Uganda Star Frank Nsubuga Creates T20 World Cup History

T20 World Cup : అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో మ్యాచులు ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి. స్వ‌ల్ప స్కోర్లు న‌మోదు అవుతున్న ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో ఉగాండా బౌల‌ర్ చ‌రిత్ర సృష్టించాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లోనే అత్యంత త‌క్కువ ఎకాన‌మీ(1.00)తో బంతులేసిన రికార్డును సృష్టించాడు. అదీ కూడా 43 ఏళ్ల వ‌య‌సులో కావ‌డం విశేషం.

ప‌పువా న్యూగినియాతో జ‌రిగిన మ్యాచ్‌లో ఉగాండా బౌల‌ర్ ఫ్రాంక్‌ న్సుబుగా 4 ఓవ‌ర్లు వేసి కేవ‌లం నాలుగు ప‌రుగులే ఇచ్చాడు. రెండు వికెట్లు తీశాడు. ఇందులో రెండు మెయిడిన్ ఓవ‌ర్లు ఉండ‌డం గ‌మ‌నార్హం.

IND vs IRE : బెస్ట్ ఫీల్డ‌ర్ అవార్డులో సూప‌ర్ ట్విస్ట్‌.. ఆశ్చ‌ర్య‌పోయిన రోహిత్ శ‌ర్మ‌, కోహ్లి.. వీడియో వైర‌ల్‌

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ చరిత్రలో అతి తక్కువ ఎకానమీ (4 ఓవ‌ర్లు )న‌మోదు చేసిన బౌల‌ర్లు వీరే..

ఫ్రాంక్‌ న్సుబుగా (ఉగాండా) – 1.00
అన్రిచ్‌ నోర్జే (సౌతాఫ్రికా) – 1.75
అజంత మెండిస్‌ (శ్రీలంక) – 2.00
మహ్మదుల్లా (బంగ్లాదేశ్‌) – 2.00
హసరంగ (శ్రీలంక) – 2.00

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో పపువా న్యూ గినియా మొద‌ట బ్యాటింగ్ చేసింది. 19.1 ఓవ‌ర్ల‌లో 77 ప‌రుగుల‌కు ఆలౌటైంది. హిరి హిరి (15), లెగా సియాక (12), కిప్లిన్ (12) లు మిన‌హా మిగిలిన వారు రెండు అంకెల స్కోరు చేయ‌లేదు. ఉగాండా బౌలర్లలో అల్పేష్ రంజానీ, కాస్మస్, జుమా మియాగీ, ఫ్రాంక్ న్సుబుగా త‌లా రెండు వికెట్లు తీశారు. అనంత‌రం ల‌క్ష్యాన్ని ఉగాండా 18.2 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఉగాండ బ్యాట‌ర్ల‌లో రియాజత్ అలీషా (33) రాణించాడు.

Aaron Jones : ఆరోన్ జోన్స్ సిక్స‌ర్ల వ‌ర్షం.. యువ‌రాజ్ సింగ్ రికార్డు క‌నుమ‌రుగు.. క్రిస్‌గేల్ రికార్డు ప‌దిలం