Marcus Stoinis : మార్క‌స్ స్టోయినిస్ విధ్వంసం.. 6,6,6,6..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆస్ట్రేలియా ఘ‌నంగా బోణీ కొట్టింది.

Marcus Stoinis : మార్క‌స్ స్టోయినిస్ విధ్వంసం.. 6,6,6,6..

Marcus Stoinis Takes Mehran Khan To Cleaners With 26 Runs In 1 Over

Marcus Stoinis – T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆస్ట్రేలియా ఘ‌నంగా బోణీ కొట్టింది. ఆల్‌రౌండ్ షోతో మార్క‌స్ స్టోయినిస్ చెల‌రేగ‌డంతో బార్బ‌డోస్ వేదిక‌గా ఒమ‌న్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 39 ప‌రుగుల తేడాతో ఆస్ట్రేలియా విజ‌యాన్ని అందుకుంది.

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 164 ప‌రుగులు చేసింది. మార్క‌స్ స్టోయినిస్ (67నాటౌట్ 36 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) డేవిడ్ వార్న‌ర్ (56 51 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్‌) లు హాఫ్ సెంచ‌రీలు చేశారు. 50 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన ఆసీస్‌ను వార్న‌ర్‌, స్టోయినిస్ జోడి ఆదుకుంది. వీరిద్ద‌రు నాలుగో వికెట్‌కు 102 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని న‌మోదు చేశారు. హెడ్‌ (12), మిచెల్‌ మార్ష్‌ (14), మ్యాక్స్‌వెల్‌ (0) లు విఫ‌లం అయ్యారు. ఒమ‌న్ బౌల‌ర్ల‌లో మెహ్రాన్‌ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. బిలాల్‌ ఖాన్‌, కలీముల్లా చెరో వికెట్ సాధించారు.

T20 World Cup 2024 : 43 ఏళ్ల వ‌య‌సులో చ‌రిత్ర సృష్టించిన ఉగాండా బౌల‌ర్‌..

అనంతరం ల‌క్ష్య ఛేద‌న‌లో ఒమ‌న్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 129 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. అయాన్ ఖాన్ (30 బంతుల్లో 36) టాప్ స్కోర‌ర్‌. ఆసీస్ బౌల‌ర్ల‌లో మార్క‌స్ స్టోయినిస్ మూడు వికెట్లు తీశాడు. మిచెల్ స్టార్క్‌, నాథ‌న్ ఎలిస్‌, ఆడ‌మ్ జంపా లు త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. అర్ధ‌శ‌త‌కంతో పాటు మూడు వికెట్లు తీసిన స్టోయినిస్‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ల‌భించింది.

ఒకే ఓవ‌ర్‌లో 26 ప‌రుగులు..
ఆసీస్ ఇన్నింగ్స్ 15వ ఓవ‌ర్‌లో స్టోయినిస్ చెల‌రేగి ఆడాడు. మెహ్రన్ ఖాన్ వేసిన ఈ ఓవ‌ర్‌లో నాలుగు సిక్స‌ర్లు బాదాడు. మొత్తంగా ఈ ఓవ‌ర్‌లో 26 ప‌రుగులు పిండుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

IND vs IRE : బెస్ట్ ఫీల్డ‌ర్ అవార్డులో సూప‌ర్ ట్విస్ట్‌.. ఆశ్చ‌ర్య‌పోయిన రోహిత్ శ‌ర్మ‌, కోహ్లి.. వీడియో వైర‌ల్‌

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)