Deepti Sharma : చ‌రిత్ర సృష్టించిన టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్‌ దీప్తి శ‌ర్మ‌..

టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్ దీప్తి శ‌ర్మ (Deepti Sharma) చ‌రిత్ర సృష్టించింది.

Deepti Sharma creates history became Most wickets in Womens T20Is

Deepti Sharma : టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్ దీప్తి శ‌ర్మ చ‌రిత్ర సృష్టించింది. అంత‌ర్జాతీయ మ‌హిళ‌ల టీ20ల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన ప్లేయ‌ర్‌గా చ‌రిత్ర సృష్టించింది. మ‌హిళ‌ల ఆసియాక‌ప్ 2026లో భాగంగా ఆదివారం థాయ్‌లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయ‌డం ద్వారా ఆమె ఈ ఘ‌న‌త సాధించింది.

కాగా.. దీప్తికి ఇది 150వ టీ20 మ్యాచ్ కావ‌డం విశేషం. హర్మన్‌ప్రీత్ కౌర్ (203), స్మృతి మంధాన (172)ల తర్వాత ఈ ఘనత సాధించిన మూడో భారత క్రీడాకారిణిగా నిలిచింది. ఇక ఓవ‌రాల్‌గా 150 లేదా అంతకంటే ఎక్కువ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన 12వ మహిళా క్రికెటర్ గా రికార్డుల‌కు ఎక్కింది.

ఈ మ్యాచ్‌లో దీప్తి శ‌ర్మ కేవ‌లం 7 బంతులు మాత్ర‌మే వేసింది. ఒక్క ప‌రుగు కూడా ఇవ్వ‌కుండా మూడు వికెట్లు ప‌డ‌గొట్టింది.

మ‌హిళ‌ల అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్లు వీరే..

* దీప్తి శ‌ర్మ (భార‌త్) – 150 మ్యాచ్‌ల్లో 171 వికెట్లు
* తిపచ్చ పుత్తవోంగ్ (థాయ్‌లాండ్‌) – 109 మ్యాచ్‌ల్లో 170 వికెట్లు
* హెన్రియెట్ ఇషిమ్వే (రువాండ‌) – 134 మ్యాచ్‌ల్లో 164 వికెట్లు
* సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లాండ్‌) – 113 మ్యాచ్‌ల్లో 154 వికెట్లు
* కారీ చాన్ (హాంగ్‌కాంగ్‌) – 115 మ్యాచ్‌ల్లో 153 వికెట్లు

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. భార‌త్ 94 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు చేసింది. షెఫాలీ వ‌ర్మ (64; 36 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) అర్థ‌శ‌త‌కం బాదింది. ప్ర‌తీకా రావ‌ల్ (22), స్మృతి మంధాన (19) రాణించారు. థాయ్‌లాండ్ బౌల‌ర్ల‌లో సులీపోర్న్ లావోమి మూడు, సునిదా చతురోంగ్-రత్తన రెండు వికెట్లు తీశారు. తిప్చా పుట్టావోంగ్, చనిద సుత్తిరుయాంగ్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

Harmanpreet Kaur : థాయ్‌లాండ్ పై ఘ‌న విజ‌యం.. టీమ్ఇండియా కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ అసంతృప్తి..

అనంత‌రం థాయ్‌లాండ్ జ‌ట్టు 16.1 ఓవ‌ర్ల‌లో 65 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. థాయ్ లాండ్ బ్యాట‌ర్ల‌లో న‌న‌ప‌త్ (41; 48 బంతుల్లో 5 ఫోర్లు) టాప్‌స్కోర‌ర్. భార‌త బౌలర్ల‌లో నంద‌ని, దీప్తి శ‌ర్మ చెరో మూడు, శ్రీచ‌ర‌ణి రెండు, క్రాంతి గౌడ్ ఓ వికెట్ తీసింది.