ఢిల్లీ తొలి వికెట్ అవుట్..

ఈ మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్ రేసుకు మార్గం సుగమం అయిపోయినట్లే. దీంతో మ్యాచ్‌ను కీలకంగా భావించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలకు బ్రేక్ వేయాలనే ప్రయత్నంలో ఓపెనర్లు దూకుడుగా ఆడుతుండగా.. ఆర్సీబీ తొలి వికెట్ చేజిక్కుంచుకుంది. 

ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో పార్థివ్ పటేల్ క్యాచ్ అందుకోవడంతో ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా (18)కు అవుట్‌గా వెనుదిరిగాడు. క్రీజులో శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్‌లు ఉన్నారు.