Deputy CM Pawan kalyan meet India women blind cricket team
Pawan Kalyan : ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్నందుకు వారిని పవన్ (Pawan Kalyan) అభినందించారు. ఒక్కొ క్రికెటర్‌కు రూ.5లక్షల చొప్పున, కోచ్‌లకు రూ.2లక్షల చొప్పున చెక్కులను అందించారు. అంతేకాకుండా ప్రతి మహిళా క్రికెటర్‌ను పట్టు చీర, శాలువా, జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతులను అందించి ఘనంగా సత్కరించారు.
ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మహిళా అంధ క్రికెటర్లు సాధించిన విజయం దేశానికే గర్వకారణమన్నారు. అంధ క్రికెటర్ల ప్రాక్టీస్ కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని, అన్ని విధాలుగా అండగా నిలవాలని అన్ని రాష్ట్రాల సీఎంలకు స్వయంగా విజ్ఞప్తి చేస్తానని చెప్పారు.
ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందన్నారు. మహిళా క్రికెటర్లు తెలిపిన అంశాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ క్రీడాకారీణులు దీపిక (జట్టు కెప్టన్), పాంగి కరుణా కుమారి ఉండటం సంతోషంగా ఉందన్నారు.
Nitish Kumar Reddy : హ్యాట్రిక్‌తో చెలరేగిన నితీశ్ కుమార్ రెడ్డి.. అయినా గానీ..
ఇక పవన్‌తో భేటీ సందర్బంగా కెప్టెన్ దీపిక.. తమ గ్రామ సమ్యలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని కోరారు. దీనిపై వెంటనే స్పందించిన పవన్.. వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకి చెందిన క్రికెటర్ కరుణకుమారికి చేసిన విజ్ఞప్తులపైనా తక్షణమే చర్యలు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు.