CSK : సీజన్ మధ్యలో చెన్నైకు భారీ ఎదురుదెబ్బ.. విజయావకాశాలపై ప్రభావం..!
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
- Thota Vamshi Kumar
- Updated on- April 18, 2024 / 04:21 PM IST
Devon Conway ruled out CSK name Richard Gleeson as replacement
Chennai Super Kings : డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గతేడాది ఆ జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ డేవాన్ కాన్వే ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. గాయం నుంచి అతడు ఇంకా కోలుకోకపోవడంతో అతడు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. కాగా.. ఈ సీజన్లో అతడు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
ఐపీఎల్ 17వ సీజన్లో ఇప్పటి వరకు చెన్నై ఆరు మ్యాచులు ఆడింది. నాలుగు మ్యాచుల్లో విజయం సాధించింది. 8 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. సీజన్ రసవత్తరంగా మారుతున్న సమయంలో అతడిలాంటి అనుభవం ఉన్న ఆటగాడు జట్టుకు దూరం కావడం సీఎస్కే కు భారీ ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.
కాగా.. అతడి స్థానంలో ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ రిచర్డ్ గ్లీసన్‌ను చెన్నై తీసుకుంది. బేస్ ప్రైజ్ రూ.50లక్షలకే అతడిని సొంతం చేసుకుంది.
‘ఐపీఎల్ 2024 సీజన్‌కు గాయం కారణంగా డేవాన్ కాన్వే దూరం అయ్యాడు. అతడి స్థానంలో రిచర్డ్ గ్లీసన్‌ను తీసుకున్నారు. ఇంగ్లాండ్ జాతీయ జట్టు తరుపును ఆరు టీ20లు ఆడిన గ్లీసన్ 9 వికెట్లు పడగొట్టాడు. అతడి బేస్ ప్రైస్ రూ.50లక్షలకే చెన్నై సొంతం చేసుకుంది.’ అని ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 17వ సీజన్లో బాగంగా చెన్నై జట్టు తన తదుపరి మ్యాచ్‌ను శక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌కు లక్నోలోని ఏకానా స్టేడియం వేదిక కానుంది.
Shah Rukh Khan : గౌతమ్ గంభీర్.. మీరు బాధపడాల్సిన అవసరం లేదు: షారుఖ్ ఖాన్
