Shah Rukh Khan : గౌత‌మ్ గంభీర్.. మీరు బాధ‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు: షారుఖ్ ఖాన్‌

కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా మంగ‌ళ‌వారం రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో ఆఖ‌రి బంతి వ‌ర‌కు హోరాహోరీగా జ‌రిగిన మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ రెండు వికెట్ల తేడాతో ఓడిపోయింది.

Shah Rukh Khan : గౌత‌మ్ గంభీర్.. మీరు బాధ‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు: షారుఖ్ ఖాన్‌

Shah Rukh Khan consoles Gautam Gambhir in heart warming dressing room speech

Shah Rukh Khan – Gautam Gambhir : కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా మంగ‌ళ‌వారం రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో ఆఖ‌రి బంతి వ‌ర‌కు హోరాహోరీగా జ‌రిగిన మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ రెండు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈజీగా గెల‌వాల్సిన మ్యాచ్‌లో జోస్ బ‌ట్ల‌ర్ కార‌ణంగా కేకేఆర్ ఓట‌మి పాలైంది. ఈ ఓట‌మితో కోల్‌క‌తా ఆట‌గాళ్లు తీవ్ర నిరాశ‌కు గురి అయ్యారు. సునీల్ న‌రైన్ విధ్వంస‌క‌ర సెంచ‌రీ చేసిన‌ప్ప‌టికీ ఓడిపోవ‌డాన్ని ప్లేయ‌ర్లు జీర్ణించుకోలేక‌పోయారు.

మ్యాచ్ అనంత‌రం తీవ్ర నిరాశ‌తో మెంటార్ గౌతమ్ గంభీర్‌తో పాటు ఆట‌గాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కి చేరుకున్నారు. మౌనంగా ఉండిపోయారు. దీన్ని గ‌మ‌నించిన కేకేఆర్ స‌హ య‌జ‌మాని షారుఖ్ ఖాన్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి ఆట‌గాళ్ల‌ను ఓదార్చారు. వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు ప్ర‌య‌త్నించాడు.

Also Read: టీ20 ప్ర‌పంచ క‌ప్‌లో టీమిండియా ఓపెనర్లుగా రోహిత్, కోహ్లీ..! పాండ్యా ఔట్?

‘మ‌న జీవితంలోకానీ, ఆట‌ల్లోగానీ కొన్నిసార్లు మ‌నం ఓట‌మికి ఏ మాత్రం అర్హులం కాదు. కొన్నిసార్లు గెల‌వ‌డానికి అర్హులం కాదు. ఏదీ ఏమైన‌ప్ప‌టికీ ఈ రోజు మ‌నం గెలిచి ఉండాల్సింది. జ‌ట్టులోని ప్ర‌తి ఒక్క ఆట‌గాడు అసాధార‌ణ ప్ర‌ద‌ర్శ‌న చేశారు. ప్ర‌తి కోల్‌క‌తా ఫ్యాన్ గ‌ర్వంతో త‌లెత్తుకునేలా ఆడారు. కాబట్టి ఎవ్వ‌రూ బాధ‌ప‌డ‌వొద్దు. నిరాశ చెందొద్దు. ఎప్ప‌టిలాగానే సంతోషంగా ఉండండి. మ‌నంద‌రిలో ఎంతో శ‌క్తి ఉంది. ఈ శ‌క్తిని మ‌నం మైదానంలో ఉప‌యోగించాలి. వ్య‌క్తిగ‌తంగా కూడా అంద‌రం ఎంతో క‌లిసిమెలిసి ఉంటున్నాం. ఈ స్నేహ‌పూర్వ‌క వాతావ‌ర‌ణాన్ని ఇలాగే కొన‌సాగిద్దాం’ అని షారుఖ్ ఖాన్ అన్నారు.

ఈ రోజు అంద‌రూ గ‌ర్వ‌ప‌డే ప్ర‌ద‌ర్శ‌న చేశార‌ని చెప్పుకొచ్చారు. ప్ర‌త్యేకంగా పేర్లు చెప్పాల్సిన ప‌ని లేద‌న్నాడు. ముఖ్యంగా గౌత‌మ్ గంభీర్ ఏ మాత్రం బాధ‌ప‌డొద్ద‌ని, మ‌నం మ‌ళ్లీ పుంజుకుంటామ‌న్న ధీమాను వ్య‌క్తం చేశారు. రింకూ సింగ్ చెప్పిన విధంగా ఈ రోజు మ‌న ఓట‌మి దేవుడి ప్ర‌ణాళిక కావొచ్చు. మంచి మంచి వ్యూహాల‌తో ముందుకు సాగుదామ‌ని షారుఖ్ తెలిపాడు.

Also Read: విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టిన జోస్ బట్లర్

మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవ‌ర్లో ఆరు వికెట్ల న‌ష్టానికి 226 ప‌రుగులు చేసింది. కేకేఆర్ బ్యాట‌ర్ల‌లో సునీల్ న‌రైన్ (109; 56 బంతుల్లో 13 ఫోర్లు 6 సిక్స‌ర్లు) శ‌త‌క్కొట్టాడు. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స‌రిగ్గా 20 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని అందుకుంది. రాజ‌స్థాన్ బ్యాట‌ర్ల‌లో జోస్ బ‌ట్ల‌ర్ (107 నాటౌట్; 60 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) సెంచ‌రీతో జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చాడు.