Dhruv Jurel : తండ్రి కార్గిల్ యుద్ధంలో.. గోల్డ్ చెయిన్ అమ్మిన త‌ల్లీ.. ధ్రువ్ జురెల్ గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

అందివ‌చ్చిన అవ‌కాశాన్ని ధ్రువ్‌జురెల్ రెండు చేతులా ఒడిసిప‌ట్టుకున్నాడు.

Dhruv Jurel

Dhruv Jurel life story : అందివ‌చ్చిన అవ‌కాశాన్ని ధ్రువ్‌జురెల్ రెండు చేతులా ఒడిసిప‌ట్టుకున్నాడు. రాజ్‌కోట్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో అరంగ్రేటం చేసిన జురెల్ 46 ప‌రుగుల‌తో రాణించాడు. ఇక రాంచీ వేదిక‌గా జ‌రుగుతున్న నాలుగో టెస్టు మ్యాచులో అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. బౌల‌ర్లు కుల్దీప్ యాద‌వ్‌, ఆకాశ్ దీప్ ల‌ను ఓ వైపు నిల‌బెట్టి మ‌రోవైపు పోరాట ప‌టిమ‌ను క‌న‌బ‌రిచాడు. తృటిలో శ‌త‌కాన్ని చేజార్చుకున్నాడు.

149 బంతులు ఎదుర్కొన్న అత‌డు 6 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో 90 ప‌రుగులు చేశాడు. ధ్రువ్ జురెల్ పోరాటంతో టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 307 ప‌రుగులు చేసింది. ఈ క్ర‌మంలో ఇంగ్లాండ్‌కు 46 ప‌రుగుల స్వ‌ల్ప ఆధిక్యం ల‌భించింది. దీంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా ధ్రువ్ జురెల్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

తండ్రి కార్గిల్ యుద్ధంలో..

ధ్రువ్ జురెల్ తండ్రి నీమ్ సింగ్ కార్గిల్ యుద్ధంలో పోరాడాడు. త‌నలాగే త‌న కొడుకు సైతం ఆర్మీలో చేరాల‌ని భావించాడు. అలా కానీ ప‌క్షంలో ఏదైన ఒక ప్ర‌భుత్వ ఉద్యోగం సాధించాల‌ని కోరుకున్నాడు. అయితే.. ధ్రువ్ మ‌న‌సు మొత్తం క్రికెట్ పైనే ఉంది. ఓ రోజు త‌న‌కు క్రికెట్ బ్యాట్ కొనివ్వ‌మ‌ని ధ్రువ్ అత‌డి నాన్న‌ను అడిగాడు. వారి ఆర్థిక ప‌రిస్థితి అంతంత మాత్ర‌మే. అదీ కాకుండా ఆర్మీ కాకుండా ఆట‌గాడిని అవుతాన‌ని ధ్రువ్ చెప్ప‌డంతో ఇందుకు నీమ్‌సింగ్ ఒప్పుకోలేదు.

WPL 2024 : డ‌బ్ల్యూపీఎల్‌లో విరాట్ కోహ్లి కొడుకు అకాయ్‌కు స్వాగ‌తం ప‌లికిన అభిమానులు

క్రికెట్ ఆడ‌నివ్వ‌క‌పోతే ఇంట్లోంచి వెళ్లిపోతాన‌ని ధ్రువ్ అత‌డి అమ్మ‌తో చెప్పాడు. అత‌డు ఎక్క‌డ పారిపోతాడు అన్న భ‌యం, త‌న కొడుకు క‌ల‌ను నిజం చేయాల‌నే ఆశ‌తో త‌న బంగారు గొలుసు అమ్మేసి ఆ డ‌బ్బుతో ధ్రువ్ కోసం క్రికెట్ కిట్‌ను కొనిచ్చింది. త‌ల్లి త‌న కోసం ప‌డుతున్న క‌ష్టాల‌ను చూసిన అత‌డు మ‌రింత శ్ర‌ద్ధ‌గా ఆడేవాడు. జానియ‌ర్ స్థాయిలో ఆగ్రా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ జ‌ట్ల‌కు ఆడాడు.

మ‌రిన్ని అవ‌కాశాల కోసం నోయిడా వెళ్లాడు. 13 ఏళ్ల వ‌య‌సులో త‌రచుగా ఆగ్రా నుంచి నోయిడా ఒంట‌రిగా ప్ర‌యాణం చేసేవాడు. అంచెలంచెలుగా ఎదిగిన ధ్రువ్ జురెల్ టీమ్ఇండియా అండ‌ర్‌-19 జ‌ట్టుకు ఎంపిక అయ్యాడు. క్ర‌మంగా టీమ్ఇండియా సీనియ‌ర్ జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నాడు. ప్ర‌స్తుతం అందివ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకునే ప‌నిలో ఉన్నాడు.

ట్రెండింగ్ వార్తలు