Rohit Sharma : రోహిత్ శర్మ చివరి టీ20 మ్యాచ్ ఆడేశాడా..?
Rohit Sharma T20 career : మరో ఏడు నెలల్లో భారత జట్టు టీ20 ప్రపంచకప్ ఆడనుంది. అయితే.. టీ20ల్లో చివరి మ్యాచ్‌ను రోహిత్ ఎప్పుడో ఆడేశాడని అంటున్నారు.
- Thota Vamshi Kumar
- Published On : November 22, 2023 / 09:31 PM IST
Rohit Sharma
వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ భవితవ్యంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. మరో ఏడు నెలల్లో భారత జట్టు టీ20 ప్రపంచకప్ ఆడనుంది. అయితే.. టీ20ల్లో చివరి మ్యాచ్‌ను రోహిత్ ఎప్పుడో ఆడేశాడని అంటున్నారు. టీమ్ఇండియా తరుపున ఈ ఫార్మాట్‌లో రోహిత్ శర్మను చూసే అవకాశం లేదని చెబుతున్నారు.
టీ20 ప్రపంచకప్ 2022లో సెమీ పైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ తరువాత టీమ్ఇండియా తరుపున ఈ ఫార్మాట్‌లో రోహిత్ శర్మ మరో మ్యాచ్ ఆడలేదు. అప్పటి నుంచి హార్ధిక్ పాండ్య నాయకత్వలోనే భారత్ టీ20 సిరీస్‌లను ఆడుతోంది. రోహిత్ శర్మ టీ20ల్లో 148 మ్యాచులు ఆడాడు. 140 స్ట్రైక్ రేటుతో 3853 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి.
Sara Tendulkar : సారా టెండూల్కర్ ఆవేదన.. నా డీప్‌ఫేక్ ఫోటోలు వైరల్ చేస్తున్నారు
‘ఇదేమీ కొత్త విషయం కాదు. వన్డే ప్రపంచకప్ పై దృష్టి పెట్టడంతో గత ఏడాది కాలంగా రోహిత్ శర్మ టీ20ల్లో ఆడడం లేదు. ఇప్పటికే ఈ విషయమై అజిత్ అగార్కర్‌తో రోహిత్ మాట్లాడారు. హిట్‌మ్యానే స్వయంగా టీ20లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇది పూర్తిగా రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం.’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు.
నలుగురు ఓపెనర్లు..
రోహిత్ శర్మ ఓపెనర్ అన్న సంగతి తెలిసిందే. రోహిత్ దూరం అయినప్పటికీ రేసులో నలుగురు ఓపెనర్లు ఉన్నారు. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ లు ఉన్నారు. వీరందరూ ఇప్పటికే ఐపీఎల్‌లో తమను తాము నిరూపించుకున్నారు. అంతేకాకుండా టీమ్ఇండియా తరుపున మ్యాచులు ఆడారు. ఒకవేళ ఈ యువ ఆటగాళ్లు రాణించకుంటే మాత్రం రోహిత్ శర్మ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని కోరే అవకాశం ఉంది.
2025 ప్రపంచ ఛాంపియన్ షిప్ పైనే దృష్టి..!
రోహిత్ ఎక్కువగా టెస్టు మ్యాచ్‌లపై దృష్టి సారించే అవకాశం ఉంది. డిసెంబర్ 2023 నుంచి మార్చి 2024 మధ్య భారత జట్టు ఏడు టెస్టు మ్యాచులు ఆడనుంది. ఇక 2025లో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌ను గెలవాలని రోహిత్ శర్మ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Amelia Kerr : టవల్‌తో బంతిని పట్టుకుంది.. భారీ మూల్యం చెల్లించుకుంది.. వీడియో వైరల్
