×
Ad

Dinesh Karthik : టీమ్ఇండియా కెప్టెన్‌గా దినేష్ కార్తీక్‌.. ఛార్జ్ తీసుకునేది ఎప్పుడో తెలుసా?

హాంకాంగ్ సిక్సెస్ టోర్న‌మెంట్‌లో దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) భార‌త కెప్టెన్‌గా నియ‌మితుడ‌య్యాడు.

Dinesh Karthik appointed captain of Team India for Hong Kong Sixes

Dinesh Karthik : టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు దినేశ్ కార్తీక్ మ‌రోసారి మైదానంలో అడుగుపెట్ట‌నున్నాడు. హాంకాంగ్ సిక్సెస్ టోర్న‌మెంట్‌లో అత‌డు భార‌త కెప్టెన్‌గా నియ‌మితుడ‌య్యాడు. ఈ విష‌యాన్ని మంగ‌ళ‌వారం నిర్వాహ‌కులు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. న‌వంబ‌ర్ 7 నుంచి 9 వ‌ర‌కు ఈ టోర్న‌మెంట్ జ‌ర‌గ‌నుంది.

2024లో అన్ని రకాల భారత క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన కార్తీక్ (Dinesh Karthik).. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో SA20లో పార్ల్ రాయల్స్ తరపున కూడా ఆడాడు.

IND vs BAN : భార‌త్‌తో మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. స్టార్ ఆట‌గాడికి గాయం..!

హాంకాంగ్ సిక్సెస్ టోర్నీకి టీమ్ఇండియా కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నుండ‌డంపై దినేశ్ కార్తీక్ స్పందించాడు. ఇది త‌న‌కు ద‌క్కిన అరుదైన గౌర‌వం అని చెప్పుకొచ్చాడు. ఈ టోర్నీకి ఎంతో ఘ‌న‌మైన చ‌రిత్ర ఉంద‌ని, ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంద‌న్నాడు. అద్భుమైన రికార్డులు ఉన్న ప్లేయ‌ర్ల బృందానికి నాయ‌కుడిగా ఉండ‌డం కోసం ఎదురుచూస్తున్నాన‌ని చెప్పుకొచ్చాడు. ఫ్యాన్స్‌కు ఆనందం, వినోదం అందించేలా ఫియ‌ర్ లెస్ క్రికెట్ ఆడ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లుగా తెలిపాడు.

Team India : భార‌త్‌కు ఐసీసీ బిగ్ షాక్‌.. భారీ జ‌రిమానా..

దినేశ్ కార్తీక్‌తో పాటు ఆర్ అశ్విన్ కూడా హాంకాంగ్ సిక్స్‌లలో ఆడతాడు. ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అశ్విన్ ఆడుతున్న తొలి పోటీ క్రికెట్ టోర్నమెంట్ ఇది. 2024లో రాబిన్ ఉతప్ప నాయకత్వంలో ఈ టోర్నీలో భార‌త్ బ‌రిలోకి దిగింది. అయితే.. అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి తొలి ద‌శ‌లోనే లీగ్ నుంచి నిష్ర్క‌మించింది. ఈ క్ర‌మంలో ఈ సారి మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.