Dinesh Karthik: దినేశ్ కార్తీక్ అరుదైన ఘనత.. చివరి బంతికి సిక్స్ కొట్టడం భారత్‌లోనే తొలి ఎన్ఎఫ్‌టీ మూమెంట్

టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కు అరుదైన గౌరవం లభించనుంది. ఈ మూమెంట్ దక్కించుకుని (ఎన్ఎఫ్‌టీ) నాన్ ఫంజిబుల్ టోకెన్ రూపంలో తొలి భారత ప్లేయర్ రికార్డు కొట్టేయనున్నాడు.

Dinesh Karthik

Dinesh Karthik: టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కు అరుదైన గౌరవం లభించనుంది. ఈ మూమెంట్ దక్కించుకుని నాన్ ఫంజిబుల్ టోకెన్(ఎన్ఎఫ్‌టీ) రూపంలో తొలి భారత ప్లేయర్ గా రికార్డు కొట్టేయనున్నాడు. మార్చి 2018లో జరిగిన నిదహాస్ ట్రోఫీలో చివరి బంతికి సిక్స్ కొట్టిన దినేశ్.. ఆ క్షణం ఫీల్ అయిన ఎమోషన్, అతని ఆలోచనలను యానిమేషన్ రూపంలో పొందుపరచనుండటమే ఆ ఘనత.

బిట్‌ కాయిన్‌, డిగో కాయిన్‌, ఈథర్‌నెట్‌ వంటి క్రిప్టో కరెన్సీల తరహాలో సెలబ్రిటీలు, ఇ-సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు సైతం డిజిటల్‌ ఫార్మాట్‌లోకి మార్చి బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మకానికి పెట్టడమే ఎన్‌ఎఫ్‌టీ అంటారు.

ఈ మూమెంట్ గురించి దినేష్‌ కార్తీక్ ఇలా స్పందించాడు. ‘నిదహాస్‌ ట్రోఫి ఫైనల్‌ నా జీవితంలో అత్యుత్తమ క్షణాల్లో ఒకటి. ఇప్పుడు గ్రాఫికల్‌ ఎన్‌ఎఫ్‌టీ రూపంలో రావడం ఎంతో సంతోషంగా ఉందని’ అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను కార్తీక్‌ సమీప బంధువు, అగ్రశ్రేణి స్క్వాష్‌ ప్లేయర్‌ సౌరవ్‌ ఘోషల్‌ సహకారంతో చేపట్టారు. దినేష్‌ కార్తీక్‌ ఎన్‌ఎఫ్‌టీ అక్టోబర్‌ 12 నుంచి వేలంలోకి రానుంది.

………………………………………………. : బాదం పాలు అతిగా తాగుతున్నారా? అయితే డేంజర్ లో పడ్డట్టే?…

క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్‌ వర్క్‌ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీల డిజిటల్‌ అస్సెట్స్‌, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వాటినే నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్‌గా వ్యవహరిస్తారు. ఈ టోకెన్లతో బ్లాక్‌ చైయిన్‌ టెక్నాలజీలో ఉండే క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు జరుపుకునే వీలుంటుంది. డీ సెంట్రలైజ్డ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అందించే యాప్‌లలోనూ అమ్మకం, కొనుగోలు వంటివి చేయొచ్చు.