IPL 2020: రాజస్థాన్ రాయల్స్‌లో కరోనా కలకలం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020కు ముందే రాజస్థాన్ రాయల్స్ లో కరోనా అలజడి మొదలైంది. ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ యగ్నిక్ కు కొవిడ్-19 పాజిటివ్ గా స్పష్టమైంది. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం ట్విట్టర్ అకౌంట్ ద్వారా అఫీషియల్ గా ఖరారు చేశారు.

‘మా ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ గ్యానిక్ కు టెస్టుల్లో కొవిడ్-19 పాజిటివ్ గా తెలసింది. సాధారణ టెస్టులతో పాటు ఫ్రాంచైజీ తరపున ఎక్స్ ట్రా రౌండ్ టెస్టులు చేస్తుండగా పాజిటివ్ అని తేలింది. మిగిలిన సభ్యులందరికీ నెగెటివ్ గానే వచ్చింది’ అని రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్లో తెలిపింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ ను యూఏఈలో ఆడేందుకు ఆమోదం తెలిపినట్లు ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ సోమవారం ప్రకటించారు. సెప్టెంబర్ 19నుంచి నవంబరు 10వరకూ మూడు సిటీలు షార్జా, అబు దాబి, దుబాయ్ లలో మ్యాచ్ లు జరగనున్నాయి. దేశంలో కరోనా కేసులు ఉన్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.