Novak Djokovic : యూఎస్ ఓపెన్‌లో నొవాక్ జకోవిచ్‌కు భారీ షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ ఆటగాడు..
యూఎస్ ఓపెన్‌లో స్టార్ ఆటగాడు నొవాక్ జకోవిచ్‌కు (Novak Djokovic) భారీ షాక్ తగిలింది.
- Thota Vamshi Kumar
- Published on- August 31, 2026 / 11:07 AM IST
Djokovic breaks down in tears after US Open first round exit
Novak Djokovic : యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం నమోదైంది. స్టార్ ఆటగాడు నొవాక్ జకోవిచ్‌కు భారీ షాక్ తగిలింది. కెరీర్‌లో 25వ గ్రాండ్ స్లామ్ లక్ష్యంతో బరిలోకి దిగిన జకోవిచ్‌కు తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది. అర్జెంటీనాకు చెందిన యువ ఆటగాడు మరియానో నవోన్ చేతిలో ఓడిపోయాడు. నాలుగు గంటల పాటు సాగిన పోరులో 6-7, 7-5, 6-4, 2-6, 1-6 తేడాతో జకోవిచ్ ఓటమి పాలయ్యాడు. ఓటమి తరువాత జకోవిచ్ భావోద్వేగంతో కోర్టును వీడాడు.
Novak Djokovic looks very emotional down 1-3 in the 5th set against Navone at the US Open.
Definitely in pain physically, but these also look like emotional tears.
4+ hours at 39 years old.
The New York crowd is trying to give him a push for another heroic comeback.
— The Tennis Letter (@TheTennisLetter) August 31, 2026
Vindhya Vishaka : పారిస్‌లో ప్రముఖ యాంకర్.. ఫోటోలు వైరల్
టైటిల్ ఫేవరెట్‌గా ఈ టోర్నీలో అడుగుపెట్టిన జకోవిచ్‌కు తొలి రౌండ్ మ్యాచ్ అంతక తేలికేం కాదని తొలి సెట్‌లోనే అర్థమైంది. అర్జెంటీనా ఆటగాడు మరియానో అద్భుతంగా ఆడడంతో తొలి సెట్‌ను జకో 6-7తో కోల్పోయాడు. అయితే.. ఆతరువాత జకోవిచ్ గట్టిగానే పుంజుకున్నాడు. వరుసగా రెండు సెట్లు (7-5, 6-4 ) కైవసం చేసుకున్నాడు. అయితే.. నాలుగో సెట్‌లో మళ్లీ తడబాటుకు గురి అయ్యాడు.
Mariano Navone defeats 24-time Grand Slam Champion Novak Djokovic in five sets. pic.twitter.com/BE8Dn3qC8j
— US Open Tennis (@usopen) August 31, 2026
ఇదే సమయంలో 39 ఏళ్ల జకోవిచ్ శారీరకంగానూ ఇబ్బంది పడ్డాడు. న్యూయార్క్ ఉక్కపోతకు తట్టుకోలేక పలుమార్లు ఐస్ బ్యాట్‌ను మెడ, ముఖంపై ఉంచుకున్నాడు. ఆఖరి సెట్‌కు ముందు మెడికల్ టైమౌట్‌ను కూడా తీసుకున్నాడు. నడుం నొప్పితో ఆఖరిలో వేగంగా ఆడలేకపోయాడు. ఈ క్రమంలోనే ఆఖరి సెట్ ను 1-6తో కోల్పోవడంతో పాటు మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు.
Deepti Sharma : చరిత్ర సృష్టించిన టీమ్ఇండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మ..
A well-deserved ovation 👏
See you again soon, @DjokerNole. pic.twitter.com/1jRBbC77Ee
— US Open Tennis (@usopen) August 31, 2026
