SRH vs RCB : స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ క్వాలిఫ‌య‌ర్‌-1 ఆడాలంటే.. ఆర్‌సీబీపై ఎంత తేడాతో గెల‌వాలంటే?

ఉప్ప‌ల్ వేదిక‌గా ఆర్‌సీబీతో నేడు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH vs RCB) త‌ల‌ప‌డ‌నుంది.

Do you know how can SRH reach qualifer 1in ipl 2026 (pic credit@ipl)

SRH vs RCB : ఐపీఎల్ 2026 చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఇప్ప‌టికే ఆర్‌సీబీ, స‌న్‌రైజ‌ర్స్ , గుజ‌రాత్ జ‌ట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. మిగిలిన ఒక్క స్థానం కోసం నాలుగు జ‌ట్లు రాజ‌స్థాన్, కేకేఆర్, పంజాబ్‌, ఢిల్లీ లు పోటీ ప‌డుతున్నాయి. మ‌రో వైపు పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్‌-2లో నిలిచేందుకు ఆర్‌సీబీ, గుజ‌రాత్, స‌న్‌రైజ‌ర్స్ లు పోటీప‌డుతున్నాయి. ఎందుకంటే టాప్‌-2లో నిలిచిన జ‌ట్లకు క్వాలిఫ‌య‌ర్‌-1లో ఆడే అవ‌కాశం ల‌భిస్తుంది. అదే స‌మ‌యంలో ఫైన‌ల్ చేరుకునేందుకు రెండు మ్యాచ్‌ల ఛాన్స్ ఉంటుంది.

ఐపీఎల్ 2026లో భాగంగా హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ వేదిక‌గా నేడు (శుక్ర‌వారం, మే22) కీల‌క మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు పోటీప‌డ‌నున్నాయి. పాయింట్ల ప‌ట్టిక‌లో ప్ర‌స్తుతం ఆర్‌సీబీ 18 పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో ఉండ‌గా స‌న్‌రైజ‌ర్స్ 16 పాయింట్ల‌తో మూడో స్థానంలో ఉంది. లీగ్ ద‌శ‌లో ఇరు జ‌ట్ల‌కు ఇదే చివ‌రి మ్యాచ్ కావ‌డం విశేషం.

MS Dhoni Future : ధోని రిటైర్‌మెంట్ పై సీఎస్‌కే బౌలింగ్ కోచ్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టాడు.. చూడండి జ‌ట్టు ప్ర‌యోజ‌నాలే..

ఈ మ్యాచ్‌లో గెలిచి త‌మ అగ్ర‌స్థానాన్ని నిలబెట్టుకోవాల‌ని ఆర్‌సీబీ భావిస్తోంది. మ‌రోవైపు స‌న్‌రైజ‌ర్స్ కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి టాప్‌-2లో చోటు ద‌క్కించుకోవాల‌ని ఆరాట‌ప‌డుతోంది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ గెలిస్తే.. అప్పుడు ఆర్‌సీబీ, గుజ‌రాత్, స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్లు స‌మానంగా 18 పాయింట్ల‌తో ఉంటాయి. మెరుగైన ర‌న్‌రేటు ఉన్న జ‌ట్లు టాప్‌-2లో చోటు ద‌క్కించుకుంటాయి. ప్ర‌స్తుతం ఆర్‌సీబీ ర‌న్‌రేటు +1.065గా ఉండ‌గా, గుజ‌రాత్ ర‌న్‌రేటు +0.695గా ఉంది. ఇక ఎస్ఆర్‌హెచ్ ర‌న్‌రేటు +0.350గా ఉంది.

స‌న్‌రైజ‌ర్స్ మ్యాచ్‌లో అతి ఘోరాతి ఘోరంగా ఓడిపోతే మిన‌హా ఆర్‌సీబీ నెట్‌ర‌న్‌రేటుకు వ‌చ్చిన న‌ష్టం ఏమీ లేదు. కాబ‌ట్టి సన్‌రైజ‌ర్స్‌తో మ్యాచ్‌లో ఓడిపోయిన‌ప్ప‌టికి కూడా ఆర్‌సీబీ అగ్ర‌స్థానంలోనే కొన‌సాగే అవ‌కాశాలు ఉన్నాయి. ఇక స‌న్‌రైజ‌ర్స్ రెండో స్థానంలో నిల‌వాలంటే గుజ‌రాత్ నెట్‌ర‌న్‌రేటును అధిగ‌మించాల్సి ఉంటుంది.

Chennai Super Kings : ఐపీఎల్ నుంచి ఔట్‌.. సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్‌తో పాటు ఆ జ‌ట్టు ఆట‌గాళ్ల‌కు బీసీసీఐ భారీ జ‌రిమానా..

ఆర్‌సీబీతో మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ తొలుత బ్యాటింగ్ చేస్తే 88 ప‌రుగుల తేడాతో, ల‌క్ష్య ఛేద‌న అయితే 12 ఓవ‌ర్లలోపు ఛేదించాల్సి ఉంటుందని క్రికెట్ విశ్లేష‌కులు చెబుతున్నారు. అప్పుడే గుజ‌రాత్ నెట్‌ర‌న్‌రేటును స‌న్‌రైజ‌ర్స్ అధిగ‌మించి రెండో స్థానానికి చేరుకుంటుంది. అప్పుడు క్వాలిఫ‌య‌ర్‌-1లో ఆడుతుంది.