MS Dhoni Future : ధోని రిటైర్మెంట్ పై సీఎస్కే బౌలింగ్ కోచ్ కుండబద్దలు కొట్టాడు.. చూడండి జట్టు ప్రయోజనాలే..
ఐపీఎల్లో ధోని భవితవ్యంపై (MS Dhoni Future) చర్చలు కొనసాగుతున్నాయి.
CSK bowling coach Eric Simons Ends Debate On MS Dhoni Future in ipl
- ఐపీఎల్ 2026లో ముగిసిన చెన్నై కథ
- ప్లేఆఫ్స్ చేరుకుండానే ఇంటి ముఖం
- ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ ఆడని ధోని
- మహేంద్రుడి భవితవ్యం పై మొదలైన చర్చలు
MS Dhoni Future : ఐపీఎల్ 2026 సీజన్లో ఎంఎస్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు. అయినప్పటికి కూడా అతడు వచ్చే ఏడాది ఆడతాడని యాజమాన్యం ఆశాభావంతో ఉంది. కాగా.. ఐపీఎల్ చరిత్రలో అందుబాటులో ఉండి కూడా ధోని ఒక్క మ్యాచ్ ఆడకపోవడం ఇదే తొలిసారి. గాయాలు, టీమ్ కాంబినేషన్ అని అంటూ 14 లీగ్‌లను ధోని ఆడలేదు. ఇక ధోని రిటైర్ అవుతాడు అన్న ఊహాగానాలు పెరుగుతున్నాయి. వీటిపై సీఎస్కే బౌలింగ్ కోచ్ ఎరిక్ సైమన్స్ స్పందించాడు. వచ్చే సీజన్లో ధోని ఆడతాడని ఫ్రాంఛైజీ ఇంకా ఆశిస్తోందని సైమన్స్ చెప్పుకొచ్చాడు.
ధోని లేని సమయంలో సీఎస్కే పలువురు యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, ఆయుష్ మాత్రే వంటి ఆటగాళ్లు క్రమం తప్పకుండా అవకాశాలు ఇచ్చారు. వీరిలో కార్తీక్ శర్మ చెప్పుకొదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడి మిడిల్ ఆర్డర్లో నమ్మదగిన బ్యాటర్‌ను అని నిరూపించుకున్నాడు.
ప్రస్తుతం సీఎస్కే జట్టు ప్రస్తుతం పరివర్తన దశలో ఉంది. వచ్చే సీజన్లో ధోని ఆడితే అది ఫ్రాంఛైజీ దీర్ఘకాలిక వ్యూహాల్ని దెబ్బతీస్తుందా అన్న సందేహాలు ఉన్నాయి. దీనిపై సైమన్స్ మాట్లాడాడు. నిజం చెప్పాలంటే ధోని ఆడతాడని తాము ఎప్పుడూ ఆశిస్తూనే ఉంటామన్నాడు. అతడు బంతిని చాలా బాగా కొడతాడని అన్నాడు. అతడి కాలికి గాయం కావడంతో పరిగెత్తడం కష్టమైంది. అందుకనే అతడు ఆడలేకపోయాడని చెప్పుకొచ్చాడు.
ధోని ఎప్పుడు ఆడతాడు అనే విషయం కేవలం అతడికి మాత్రమే తెలుస్తుంది. నేను మీకు ఒకటి చెబుతాను.. తాను సిద్ధంగా లేనని అతడికి అనిపిస్తే ఆడడు. సిద్ధంగా ఉన్నానని అనుకుంటే మాత్రం ఆడతాడు. అతడు జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటాడు తప్ప, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. ఏదీఏమైనప్పటికి కూడా అతడు ఆడితేనే బాగుంటుంది. అతడు జట్టులో ఉంటే యువ ఆటగాళ్లు ఎంతో నేర్చుకోవచ్చు.
