IPL : జట్ల మీద వేల కోట్లు జల్లుతున్నారు.. ఐపీఎల్‌లో వీళ్లకి డబ్బెలా వస్తుంది? రాబడి ఎలా?

ఐపీఎల్‌లో (IPL ) జ‌ట్ల‌ను కొనుగోలు చేసేందుకు వేల కోట్లను మంచినీళ్ల ప్రాయంలా పెడుతుంటారు.మ‌రి వీళ్ల‌కు జ‌ట్ల‌ను కొనుగోలు చేయ‌డం వ‌ల్ల ఏం లాభం వ‌స్తుంది? ఐపీఎల్ ద్వారా వీరికి ఎన్ని ర‌కాలుగా ఆదాయాలు వ‌స్తాయో ఓ సారి చూద్దాం.

Do you know how franchises make money in IPL

IPL : ఐపీఎల్‌లో రెండు ఫ్రాంఛైజీలు చేతులు మార‌నున్నాయి. రాయ‌ల్‌ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌లు భారీ మొత్తానికి అమ్ముడు పోయాయి. ఆదిత్య బిర్లా గ్రూప్‌, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్ట్ వెంచ‌ర్స్‌, బీఎక్స్‌పీఈ-బ్లాక్ స్టోన్ సంస్థ‌లు క‌లిసి ఆర్‌సీబీని 16,706 కొనుగోలు చేశాయి. రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ను 15.300 కోట్ల‌కు అమెరికాకు చెందిన వ్యాపార‌వేత్త క‌ల్ సోమానీ నేతృత్వంలోని క‌న్సార్షియా కొనుగోలు చేసింది. సోమానీతో పాటు వాల్‌మార్ట్‌కు చెందిన రాబ్ వాల్ట‌న్, ఫోర్ట్ మోటార్ కంపెనీ య‌జ‌మాని హాంప్ కుటుంబం క‌న్సార్షియంలో స‌భ్యులుగా ఉన్నారు.

ఐపీఎల్‌లో జ‌ట్ల‌ను కొనుగోలు చేసేందుకు వేల కోట్లను మంచినీళ్ల ప్రాయంలా ఖ‌ర్చుపెడుతుంటారు? మ‌రి వీళ్ల‌కు జ‌ట్ల‌ను కొనుగోలు చేయ‌డం వ‌ల్ల ఏం లాభం వ‌స్తుంది? ఐపీఎల్ ద్వారా వీరికి ఎన్ని ర‌కాలుగా ఆదాయాలు వ‌స్తాయో ఓ సారి చూద్దాం.

Shane Warne : భారీ మొత్తానికి అమ్ముడుపోయిన రాజ‌స్థాన్.. షేన్ వార్న్ కుటుంబానికి జాక్‌పాట్‌.. కోట్ల రూపాయ‌లు

వాస్త‌వానికి ఐపీఎల్ ఫ్రాంఛైజీలు కొనుగోలు చేసిన ఏ మేనేజ్‌మెంట్ కూడా న‌ష్ట‌పోద‌ని నిపుణులు చెబుతున్నారు. ఆట‌గాళ్ల కొనుగోలు, స్టేడియాల్లో మ్యాచ్‌ల నిర్వ‌హ‌ణ కోసం చేసిన ఖ‌ర్చుకు ప‌దింత‌ల‌ ఆదాయాన్ని ఆర్జింవ‌చ్చున‌ని అంటున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీల‌కు వేరు వేరు రూపాల్లో వంద కోట్ల రూపాయాల ఆదాయం ల‌భిస్తుందట‌.

మీడియా హక్కులు..

ఐపీఎల్ మ్యాచ్‌ల స్ట్రీమింగ్‌కు సంబంధించిన మీడియా హ‌క్కుల అమ్మ‌కం ద్వారా బీసీసీఐ భారీగానే ఆదాయాన్ని పొందుతుంది. మీడియా రైట్స్ అమ్మ‌డం ద్వారా వ‌చ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని బీసీసీఐ తీసుకుని, మిగిలిన మొత్తాన్ని అన్ని జ‌ట్ల‌కు పంచుతుంది. ఐపీఎల్ జ‌ట్ల‌కు వ‌చ్చే ఆదాయంలో మీడియా హ‌క్కులను విక్ర‌యిండం ద్వారానే 60 నుంచి 70 ఆదాయం వ‌స్తుంది.

టైటిల్ స్పాన్స‌ర్‌షిప్‌..

మీడియా హ‌క్కుల విక్ర‌యంతో పాటు ఐపీఎల్ టైటిల్ స్పాన్స‌ర్ షిప్ ద్వారా ఐపీఎల్ ఫ్రాంఛైజీల‌కు ఆదాయం వ‌స్తుంది. ప్ర‌స్తుతం ఐపీఎల్‌కు టాటా టైటిల్ స్పాన్స‌ర్‌గా ఉంది. టాటా చెల్లించే దాంట్లో కొంత మొత్తాన్ని బీసీసీఐ తీసుకుని మిగిలిన మొత్తాన్ని ఫ్రాంఛైజీల‌కు పంచుతుంది.

Kal Somani : ఎవరు బ్రో నువ్వు 15వేల కోట్లు పెట్టి కొన్నావ్.. RR కొత్త ఓనర్ బయోగ్రఫీ..

బ్రాండ్ స్పాన్స‌ర్స్‌..

బ్రాండ్ స్పాన్స‌ర్ల ద్వారా కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలకు గ‌ట్టిగానే ఆదాయం వ‌స్తుంది. ప్ర‌తీ జ‌ట్టుకు కొంద‌రు స్పాన్స‌ర్ ఉంటారు. ఆట‌గాళ్లు ధ‌రించే జెర్సీల‌పై ఈ స్పాన్స‌ర్ల పేర్లు క‌నిపిస్తాయి. త‌మ కంపెనీలను ప్ర‌మోట్ చేసుకోవ‌డం కోసం స్పాన్స‌ర్లు ఫ్రాంచైజీల‌తో ఒప్పందాలు చేసుకుంటాయి. ఇందు కోసం కంపెనీలు.. ఫ్రాంచైజీల‌కు భారీ మొత్తాన్నే చెల్లిస్తుంటాయి.

టికెట్ల అమ్మకాలు..

ప్ర‌తి ఫ్రాంచైజీ కూడా ఐపీఎల్‌లో తాము ఆడే మ్యాచ్‌ల్లో స‌గం మ్యాచ్‌ల‌ను హోం గ్రౌండ్ల‌లోనే ఆడుతుంటాయి. ఈ మ్యాచ్‌ల టికెట్ల అమ్మ‌కాల‌తో ఎక్కువ భాగం ప్రాంచైజీల ఖాతాలోకే వెలుతుంది.

ప్రైజ్ మ‌నీ..

ఇక టోర్న‌మెంట్ లో మంచి ప్ర‌ద‌ర్శ‌న చేసి విజేత‌గా నిలిచే జ‌ట్టుతో పాటు ర‌న్న‌ర‌ప్, ప్లేఆఫ్స్‌కు చేరిన‌ జ‌ట్ల‌కు బీసీసీఐ ప్రైజ్‌మ‌నీ అందిస్తూ ఉంటుంది. ఈ మొత్తం ఫ్రాంచైజీల‌కే ద‌క్కుతుంది.

సేల్స్ ద్వారా..

ప్లేయ‌ర్ల‌ను మార్చుకోవ‌డం, త‌మ బ్రాండ్ టీష‌ర్టులు, క్యాప్‌లు, ఇత‌ర ఆట వ‌స్తువులను విక్ర‌యించడం ద్వారా కూడా ఫ్రాంచైజీలు భారీగానే ఆదాయాన్ని పొందుతాయి.