IND vs ZIM : భారత్, జింబాబ్వేల మధ్య రెండో టీ20 మ్యాచ్.. ఫ్రీగా ఎలా చూడొచ్చొ తెలుసా?
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, జింబాబ్వే జట్ల మధ్య (IND vs ZIM ) నేడు (శనివారం) రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.
- Thota Vamshi Kumar
- Published on- July 25, 2026 / 03:07 PM IST
Do you know where to watch India vs Zimbabwe 2nd T20I match for Free
IND vs ZIM : మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, జింబాబ్వే జట్ల మధ్య నేడు (శనివారం) రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. హరారే ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో గెలిచిన భారత జట్టు ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన జింబాబ్వే జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో మ్యాచ్ హోరా హోరీగా సాగే అవకాశం ఉంది.
తనకు అచ్చొచ్చిన మైదానంలో తొలి మ్యాచ్‌లో 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీ పైనే ప్రస్తుతం అందరి దృష్టి నెలకొని ఉంది. రెండో మ్యాచ్‌లోనూ అతడు విజృంభించి ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
భారత్, జింబాబ్వేల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?
భారత్, జింబాబ్వేల మధ్య రెండో టీ20 మ్యాచ్ నేడు (జూలై 25 శనివారం) నాడు జరగనుంది.
భారత్, జింబాబ్వేల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?
భారత్, జింబాబ్వేల మధ్య జరిగే రెండో టీ20 మ్యాచ్ హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరగనుంది.
భారత్, జింబాబ్వేల రెండో టీ20 మ్యాచ్ ఏ సమయానికి ప్రారంభమవుతుంది?
భారత్, జింబాబ్వేల మధ్య జరిగే రెండో టీ20 మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమవుతుంది. అరగంట ముందు టాస్ వేస్తారు.
ఎక్కడ చూడొచ్చు?
భారత్ వర్సెస్ జింబాబ్వే రెండవ టీ20 మ్యాచ్ టీవీల్లో అయితే.. యునైట్8 స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఓటీటీలో అయితే.. ఫ్యాన్‌కోడ్ యాప్, వెబ్‌సైట్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఫ్రీగా ఎలా చూడాలి?
టీవీల్లో అయితే.. డిడి స్పోర్ట్స్ (డిడి ఫ్రీ డిష్)లో ఫ్రీగా చూడొచ్చు.
