Shreyas Iyer : కెప్టెన్‌గా తొలి గెలుపు.. ధోని ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్.. శ్రేయస్ అయ్యర్ తోపు సామీ..
జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలవడం ద్వారా టీమ్ఇండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer ) అరుదైన ఘనత సాధించాడు.
Shreyas Iyer is the first captain in the world to win the toss in each of his first 8 T20 matches
Shreyas Iyer : జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. హరారే వేదికగా గురువారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో శ్రేయస్ సేన గెలుపొందింది. కాగా.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలవడం ద్వారా టీమ్ఇండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు. పురుషుల టీ20 క్రికెట్లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తొలి 8 మ్యాచ్‌ల్లోనూ టాస్ గెలిచిన ఏకైక కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో అతడు బహమాస్‌కు చెందిన గ్రెగొరి టేలర్ (7)ను అధిగమించాడు.
ఇక భారత కెప్టెన్లలో వరుసగా అత్యధిక టీ20 మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన కెప్టెన్‌గానూ శ్రేయస్ రికార్డులకు ఎక్కాడు. ఈ క్రమంలో దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనిని అధిగమించాడు. మే 2010 నుంచి ఫిబ్రవరి 2012 మధ్య ధోని వరుసగా ఏడు టీ20 మ్యాచ్‌ల్లో టాస్ గెలిచాడు.
Sikandar Raza : ఆ ఒక్క కారణం వల్ల ఓడిపోయాం.. జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా కామెంట్లు..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. జింబాబ్వే బ్యాటర్లలో వెస్లీ మధెవెరె (39) రాణించాడు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్‌లు చెరో రెండు వికెట్లు సాధించారు. శివమ్ దూబె, రవిబిష్ణోయ్‌లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
ఆ తరువాత వైభవ్ సూర్యవంశీ (50; 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) విజృంభణతో 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 13.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 35 పరుగులు), శ్రేయస్ అయ్యర్ (24 బంతుల్లో 28 నాటౌట్) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబాని రెండు వికెట్లు తీశాడు.
