NZ vs SA : ద‌క్షిణాఫ్రికా, న్యూజిలాండ్ టీ20 సిరీస్‌ను ఎక్క‌డ చూడొచ్చొ తెలుసా?

ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు న్యూజిలాండ్ (NZ vs SA) ప‌ర్య‌ట‌న‌కు వెళ్లింది.

Do you know where to watch New Zealand vs South Africa T20 Series

  • న్యూజిలాండ్, ద‌క్షిణాఫ్రికాల మ‌ధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌
  • ఆదివారం ఇరు జ‌ట్ల మ‌ధ్య తొలి టీ20 మ్యాచ్‌

NZ vs SA : ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లింది. ఈ ప‌ర్య‌ట‌న‌లో సౌతాఫ్రికా ఆతిథ్య దేశం కివీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడ‌నుంది. ఈ టీ20 సిరీస్ మార్చి15 (ఆదివారం) ప్రారంభం కానుంది.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో ద‌క్షిణాఫ్రికా సెమీఫైన‌ల్ నుంచి నిష్ర్క‌మించ‌గా, న్యూజిలాండ్ జ‌ట్టు ర‌న్న‌ర‌ప్‌తో స‌రిపెట్టుకుంది. ఈ నేప‌థ్యంలో 2028 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ల‌క్ష్యంగా ఇరు జ‌ట్లు త‌మ జ‌ట్ల‌ను బ‌లోపేతం చేసుకోవాల‌ని చూస్తున్నాయి. రెండు మేటీ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నుండ‌డంతో ఈ సిరీస్ పై క్రికెట్ అభిమానుల్లో ఆస‌క్తి ఏర్ప‌డింది.

BAN vs PAK : చ‌రిత్ర సృష్టించిన పాక్ ఆట‌గాడు.. విండీస్ దిగ్గ‌జ ప్లేయ‌ర్‌ క్రిస్‌గేల్ రికార్డు బ్రేక్‌..

ద‌క్షిణాఫ్రికా, న్యూజిలాండ్ టీ20 సిరీస్‌ను ఎక్క‌డ చూడొచ్చొ వంటి విష‌యాల‌ను ఓసారి చూద్దాం.

ఆదివారం మౌంట్ మౌంగనుయ్‌లోని బే ఓవల్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జ‌ట్లు తొలి టీ20 మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇక ఈ సిరీస్‌ను హ‌క్కుల‌ను భార‌త దేశంలో సోనీ స్పోర్ట్స్ నెట్‌వ‌ర్క్ క‌లిగి ఉంది.

ఈ క్ర‌మంలో టీవీల్లో సోనీ స్పోర్ట్స్ నెట్‌వ‌ర్స్‌లోని ఛాన‌ల్స్‌లో వీక్షించ‌వ‌చ్చు. ఇక ఓటీటీలో అయితే.. ఫ్యాన్ కోడ్‌, సోనీ లివ్ యాప్, వెబ్‌సైట్‌లో మ్యాచ్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. భార‌త‌కాల‌మానం ప్ర‌కారం మ్యాచ్‌లు మ‌ధ్యాహ్నం 11.45కు ప్రారంభం కానున్నాయి.

కివీస్‌, సౌతాఫ్రికా షెడ్యూల్ ఇదే..

* తొలి టీ20 మ్యాచ్ – మార్చి 15న‌
* రెండో టీ20 మ్యాచ్ – మార్చి 17న‌
* మూడో టీ20 మ్యాచ్ – మార్చి 20న‌
* నాలుగో టీ20 మ్యాచ్ – మార్చి 22న‌
* ఐదో టీ20 మ్యాచ్ – మార్చి 25న‌

స్క్వాడ్‌లు ఇవే..

న్యూజిలాండ్..
మిచెల్ సాంట్నర్, కేటీన్ క్లార్క్, జోష్ క్లార్క్సన్, డేన్ క్లీవర్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, జాక్ ఫౌల్కేస్, బెవాన్ జాకబ్స్, కైల్ జామిసన్, నిక్ కెల్లీ, టామ్ లాథమ్, జేడెన్ లెన్నాక్స్, కోల్ మెక్‌కాంచీ, జిమ్మీ నీషమ్, టిమ్ రాబిన్సన్, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, ఇష్ సోధి.

BAN vs PAK : స‌ల్మాన్ అఘా ర‌నౌట్ పై మెహ‌దీ హ‌స‌న్ మిరాజ్ హాట్‌ కామెంట్స్‌.. కావాల‌నే చేశా.. అప్పుడు నేను ఆలోచించింది అదొక్క‌టే..

దక్షిణాఫ్రికా..
కేశవ్ మహారాజ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, వియాన్ ముల్డర్, గెరాల్డ్ కోయెట్జీ, టోనీ డి జోర్జి, కానర్ ఎస్టర్‌హుజెన్, డయాన్ ఫారెస్టర్, జోర్డాన్ హెర్మన్, రూబిన్ హెర్మాన్, జార్జ్ లిండే, న్కోబానీ మోకోయెనా, ఆండిల్ సిమెలనే, లూథో జలాన్‌సన్ సుబామ్లా, ప్రీన్ జలాన్‌సోనేమి.