×
Ad

Abhishek Sharma : సోద‌రి కోమ‌ల్ వివాహానికి వెళ్ల‌ని అభిషేక్ శ‌ర్మ‌.. ఎందుకో తెలుసా.. భార‌త జెర్సీ ధ‌రించి..

సోద‌రి కోమ‌ల్ శ‌ర్మ వివాహానికి అభిషేక్ శ‌ర్మ (Abhishek Sharma) హాజ‌రుకాలేదు.

Do you know why Abhishek Sharma skips sister Komals wedding

Abhishek Sharma : టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ సూప‌ర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవ‌ల ముగిసిన ఆసియాక‌ప్ 2025లో విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌ల‌తో భార‌త విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించాడు. ఈ క్ర‌మంలో ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్న‌మెంట్ అందుకున్నాడు. అయితే.. అత‌డు త‌న సోద‌రి కోమ‌ల్ శ‌ర్మ వివాహానికి హాజ‌రు కాలేదు.

అభిషేక్ శ‌ర్మ (Abhishek Sharma) సోద‌రి కోమ‌ల్ శ‌ర్మ వివాహం లుథియానాకు చెందిన ప్ర‌ముఖ వ్యాపార వేత్త ల‌వీశ్‌తో అమృత్‌స‌ర్‌లో శుక్ర‌వారం (అక్టోబ‌ర్ 3)న ఘ‌నంగా జ‌రిగింది. అయితే.. పెళ్లికి అభిషేక్ హాజ‌రు కాలేదు. ఈ విష‌యాన్ని అత‌డి సోద‌రి ధ్రువీక‌రించింది.

Mohsin Naqvi : ఆసియాక‌ప్‌తో పారిపోయిన పీసీబీ చీఫ్ న‌ఖ్వీకి పాక్‌లో స‌న్మానం..! ఏకంగా గోల్డ్ మెడ‌ల్‌..

పెళ్లి అనంత‌రం కోమ‌ల్ మీడియాతో మాట్లాడింది. ‘ఇది అద్భుతంగా అనిపిస్తుంది. నా జీవితంలో ఇది గొప్ప‌రోజు. నేను పెళ్లి చేసుకున్నాను. ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నాను. నా సోద‌రుడు అభిషేక్‌ను మిస్ అవుతున్నా.’ అని కోమ‌ల్ తెలిపింది.

అభిషేక్ పెళ్లికి ఎందుకు వెళ్ల‌లేదంటే..?

భార‌త్‌-ఏ, ఆస్ట్రేలియా-ఏ జ‌ట్ల మ‌ధ్య అక్టోబ‌ర్ 3నే రెండో అన‌ధికారిక వ‌న్డే మ్యాచ్ జ‌రిగింది. కాన్పూర్ వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్‌లో భార‌త్‌-ఏ త‌రుపున అభిషేక్ శ‌ర్మ ఆడాడు. అందుక‌నే అత‌డు సోద‌రి కోమ‌ల్ వివాహానికి హాజ‌రుకాలేక‌పోయాడు. అయిన‌ప్ప‌టికి భార‌త జెర్సీ ధ‌రించి మ్యాచ్ కోసం సిద్ధ‌మ‌వుతూ కూడా పెళ్లి తంతును వీడియోకాల్‌లో చూశాడు. ఇందుకు సంబంధించిన స్ర్కీన్‌షాట్‌ను అభిషేక్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.

 

IND vs WI : నితీష్ కుమార్ రెడ్డి స్ట‌న్నింగ్ క్యాచ్‌.. సూప‌ర్‌మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి.. లంచ్ విరామానికి విండీస్ ఐదు వికెట్లు డౌన్‌..

అయితే.. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శ‌ర్మ విఫ‌లం అయ్యాడు. గోల్డెన్ డ‌కౌట్ అయ్యాడు. తొలి బంతికే ఫీల్డ‌ర్ క్యాచ్ అందుకోవ‌డంతో ప‌రుగులు ఏమీ చేయ‌కుండానే పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.