IND vs WI : నితీష్ కుమార్ రెడ్డి స్టన్నింగ్ క్యాచ్.. సూపర్‌మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి.. లంచ్ విరామానికి విండీస్ ఐదు వికెట్లు డౌన్..
వెస్టిండీస్, భారత్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో (IND vs WI) తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.

IND vs WI 1st test nitish reddy stunning catch Video viral
IND vs WI : అహ్మదాబాద్ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. మూడో రోజు ఆటలో (IND vs WI) టీమ్ఇండియా ఆల్‌రౌండర్, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్‌లో ఇది చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ను మహ్మద్ సిరాజ్ వేశాడు. ఈ ఓవర్‌లోని రెండో బంతిని టాగెనరైన్ చంద్రపాల్ (8)భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. తన ఎడమ చేతి వైపుకు వచ్చిన బంతిని గాల్లోకి ఎగిరి నితీష్ కుమార్ రెడ్డి డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗖𝗔𝗧𝗖𝗛. 👏
Nitish Kumar Reddy grabs a flying stunner 🚀
Mohd. Siraj strikes early for #TeamIndia ☝️
Updates ▶️ https://t.co/MNXdZceTab#INDvWI | @IDFCFIRSTBank | @NKReddy07 pic.twitter.com/1Bph4oG9en
— BCCI (@BCCI) October 4, 2025
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మూడో రోజు ఆట ప్రారంభం కాగానే.. రెండో రోజు ఓవర్ నైట్ స్కోరు 448/5 వద్దనే భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. 286 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన విండీస్ జట్టు తడబడుతోంది. భారత బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోతుంది.
మూడో రోజు లంచ్ విరామానికి ఐదు వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసింది. అలిక్ అథనాజ్ (27), జస్టిన్ గ్రీవ్స్ (10)లు క్రీజులో ఉన్నారు. విండీస్ ఇంకా 220 పరుగులు వెనుకబడి ఉంది. భారత బౌలర్లలో జడేజా మూడు వికెట్లు తీశాడు. సిరాజ్, కుల్దీప్‌లు తలా ఓ వికెట్ పడగొట్టాడు.
మ్యాచ్ స్కోర్లు..
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్.. 162
భారత తొలి ఇన్నింగ్స్ .. 448/5 డిక్లేర్
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్.. మూడో రోజు లంచ్ విరామానికి 66/5