T20 World Cup 2021: పాక్ మ్యాచ్‌లో వైఫల్యం.. రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్

టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు దూసుకుపోతుంది. తొలి మ్యాచ్ లో టీమిండియా, తర్వాత న్యూజిలాండ్, అఫ్ఘినిస్తాన్ లను ఓడించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది.

T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు దూసుకుపోతుంది. తొలి మ్యాచ్ లో టీమిండియా, తర్వాత న్యూజిలాండ్, అఫ్ఘినిస్తాన్ లను ఓడించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ పాకిస్తాన్ తో మ్యాచ్ లో తమ జట్టు ఓడిపోయిందని, యువ ఆటగాళ్లకు స్థానమివ్వాలనే ఉద్దేశ్యంతో తాను రిటైర్ అవుతున్నట్లు నిర్ణయం తీసుకున్నాడు అఫ్గానిస్తాన్‌ వెటరన్‌ క్రికెటర్‌ అస్గర్‌ అఫ్గాన్‌.

నమీబియాతో మ్యాచ్‌కు ముందే ఈ ప్రకటన చేయగా.. ఆఖరి మ్యాచ్‌ లో 31 పరుగులు నమోదు చేశాడు. అస్గర్‌ మైదానంలో అడుగుపెట్టే సమయంలో స్కాట్లాండ్‌ ఆటగాళ్లు గార్డ్‌ హాఫ్‌ ఆనర్‌ తో గౌరవించి క్రీడాస్పూర్తిని చాటారు. పెవిలియన్‌ చేరిన తర్వాత డగౌట్‌లో కాస్త ఎమోషనల్‌ అయ్యాడు.

‘అప్గానిస్తాన్‌ క్రికెట్‌కు నా సేవలు ముగిశాయి. అఫ్గన్‌ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగేందుకు నాకు సపోర్ట్ ఇచ్చిన వారందరికీ కృతజ్థతలు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇ‍వ్వాలనే ఉద్దేశ్యంతో రిటైర్మెంట్‌ ప్రకటించా. టి20 ప్రపంచకప్‌ మధ్యలోనే వైదొలగడం బాధ కలిగిస్తున్నా.. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడానికే నిర్ణయం తీసుకున్నా’

……………………………………….: విశాఖలో పవన్ ర్యాలీ.. వెల్లువలా కదలిన జన సైనికులు

‘పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఓడిపోవడం జట్టును బాధించింది. బాబర్‌ అజమ్‌ టీం స్ట్రాంగ్‌‌గా ఉన్నప్పటికీ ఓడించాలని శతవిధాలా ప్రయత్నించాం. మ్యాచ్‌లో కెప్టెన్‌ నబీతో కలిసి కీలక ఇన్నింగ్స్‌ ఆడా. మ్యాచ్‌ ఓడిపోవడం బాధ కలిగించింది’ అని చెప్పుకొచ్చాడు.

అస్గర్‌.. అఫ్గానిస్థాన్‌ తరఫున 6 టెస్ట్‌లు, 115 వన్డేలు, 75 టీ20ల్లో 4వేలకు పైగా పరుగులు సాధించాడు. ఇందులో 2 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అస్గర్‌కు టీ20 కెప్టెన్సీలో ఘనమైన రికార్డు ఉంది. షార్ట్ ఫార్మాట్‌లో అత్యధిక​ విజయాలు సాధించిన కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. 2015-2021 మధ్యలో 52 టీ20ల్లో అఫ్గానిస్తాన్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అస్గర్‌.. అత్యధికంగా 42 విజయాలు నమోదు చేశాడు.

ట్రెండింగ్ వార్తలు