ENG-W vs IND-W : ఇదేం ఫీల్డింగ్‌రా అయ్యా.. భారత్‌తో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మహిళల ఫీల్డింగ్ వైరల్.. నవ్వకుండా ఉండలేరు..
క్రికెట్‌లో అప్పుడప్పుడు కొన్ని సరదా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా అలాంటి ఓ సంఘటన భారత్, ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య (ENG-W vs IND-W) జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో చోటు చేసుకుంది.
- Thota Vamshi Kumar
- Updated on- June 4, 2026 / 01:04 PM IST
ENG-W vs IND-W 3rd T20 match Sophie Ecclestone Makes Comical Fielding Blunder
ENG-W vs IND-W : క్రికెట్‌లో అప్పుడప్పుడు కొన్ని సరదా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా అలాంటి ఓ సంఘటన భారత్, ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ భారత బ్యాటర్ రిచాను రనౌట్ చేసేందుకు ప్రయత్నించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ వేసింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి యార్కర్ వేయగా రిచా ఘోష్ షాట్ ఆడింది. సింగిల్ కోసం ప్రయత్నించింది. అయితే.. సోఫీ వద్దకే వెళ్లింది. బంతి అందుకున్న సోఫీ ఈజీగా రనౌట్ చేసే అవకాశాన్ని మిస్ చేసింది. సోఫీ బంతిని అందుకోవడంతో తాను రనౌట్ కాక తప్పదని భావించిన రిచా పరుగును మధ్యలోనే ఆపేసింది
Suryakumar Yadav : టీ20 కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్ ఔట్! రేసులో హైదరాబాదీ కుర్రాడు..
What on earth did I just witness? 🤣 pic.twitter.com/xgOcbtHZ2f
— Out Of Context Cricket (@GemsOfCricket) June 3, 2026
అయితే.. సోఫీ అండర్ ఆర్మ్‌తో స్టంప్స్‌ను పడగొట్టేందుకు ప్రయత్నించగా బంతి వికెట్లను తాకలేదు. దీన్ని గమనించిన రిచా పరుగు పూర్తి చేసింది. అంతేకాకుండా ఈ ఓవర్ త్రో కారణంగా మరోక ఎక్స్‌ట్రా పరుగును కూడా పూర్తి చేశారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (56; 40 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించింది. యస్తిక భాటియా (32; 18 బంతుల్లో 7 ఫోర్లు), దీప్తి శర్మ (32; 24 బంతుల్లో 3 ఫోర్లు) లు రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో లారెన్ బెల్ రెండు వికెట్లు తీసింది. లిన్సే స్మిత్, షార్లెట్ డీన్ చెరో వికెట్ పడగొట్టింది.
Virat Kohli : బ్రేకింగ్ న్యూస్.. అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్.. కోహ్లీ ఔట్..!
Reminds me of school cricket https://t.co/tcUMNsAOXi
— PirateKing (@righthandofgarp) June 3, 2026
ఆ తరువాత ఆలిస్ క్యాప్సే (82; 43 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు), హీథర్ నైట్ (70 నాటౌట్; 42 బంతుల్లో 10 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో రాణించడంతో 181 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత మహిళా బౌలర్లలో అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్‌లు చెరో రెండు వికెట్లు తీశారు.
ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇంగ్లాండ్ మహిళలు 2-1తో కైవసం చేసుకున్నారు.
