Eoin Morgan: ప్రొఫెషనల్‌ క్రికెట్‌‌‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఇయాన్ మోర్గాన్

2022జూన్ 28న అంతర్జాతీయ క్రికెట్‌కు ఇయాన్ మోర్గాన్ గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్ల ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ట్విటర్ వేదికగా మోర్గాన్ వెల్లడించారు.

Eoin Morgan

Eoin Morgan: ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్, 2019 ప్రపంచ కప్ విజేత జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ప్రొఫెసనల్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని సోమవారం మధ్యాహ్నం తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. 2022జూన్ 28న అంతర్జాతీయ క్రికెట్‌కు మోర్గాన్ గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్ల ప్రొఫెనషల్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ట్విటర్ లో మోర్గాన్ వెల్లడించారు.

Eoin Morgan Retire : రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్

ఐర్లాండ్ జట్టు తరపున అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన మోర్గాన్ మూడేళ్లు ఆ జట్టు తరపున ఆడాడు. ఆ తరువాత ఇంగ్లండ్ తరపున ఆటను ప్రారంభించి 13ఏళ్లు జట్టులో కొనసాగాడు. ఇంగ్లాండ్ జట్టుతో ఉన్న తన 13ఏళ్ల కెరీర్‌లో 225 వన్డేలు, 115 టీ20 మ్యాచ్‌లు మోర్గాన్ ఆడాడు. 2019 సంవత్సరంలో ఇంగ్లాండ్‌కు కెప్టెన్ హోదాలో తొలి వన్డే ప్రపంచ కప్ అధించిన ఘనత మోర్గాన్‌ది. ప్రస్తుతం మోర్గాన్ వయస్సు 36ఏళ్లు. ఇంగ్లాండ్ కెప్టెన్‌గా ఏడేళ్లు మోర్గాన్ కొనసాగాడు.

 

 

2022లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న మోర్గాన్ .. ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పార్ల్ రాయల్స్ జట్ల తరపున కొనసాగుతున్నాడు. తాజాగా తన రిటైర్మెంట్ ప్రకటనతో అన్నీ క్రికెట్ టోర్నీల నుంచి మోర్గాన్ తప్పుకున్నట్లయింది. అయితే, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తరువాత తన కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయంలో వెచ్చించగలిగానని చెప్పిన మోర్గాన్.. తాజా నిర్ణయంతో ఇంకాస్త అధిక సమయం వారికి కేటాయించే అవకాశం ఉంటుందని తెలిపారు. అయితే, క్రికెట్‌తో నా అనుబంధం కొనసాగుతుందని మోర్గాన్ చెప్పాడు. వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా బ్రాడ్ కాస్టర్లతో నా అనుబంధం కొనసాగుతుందని మోర్గాన్ స్పష్టం చేశాడు.