Faf du Plessis : స్టన్నింగ్ క్యాచ్‌.. 39 ఏళ్ల వ‌య‌సులోనూ.. న‌మ్మ‌లేక‌పోతున్నాం.. వీడియో వైర‌ల్‌

39 ఏళ్ల వ‌య‌సులోనూ ద‌క్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అద్భుత‌మైన క్యాచ్‌ను అందుకున్నాడు.

39 ఏళ్ల వ‌య‌సులోనూ ద‌క్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అద్భుత‌మైన క్యాచ్‌ను అందుకున్నాడు. సౌతాఫ్రికా20 లీగ్ 2024లో జోబర్గ్ సూపర్ కింగ్స్ కు డుప్లెసిస్ నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. లీగ్‌లో భాగంగా శ‌నివారం జోబర్గ్ సూపర్ కింగ్స్, ముంబై కేప్ టౌన్‌ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ డుప్లెసిస్ వెన‌క్కి ప‌రిగెడుతూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.

ముంబై ఇన్నింగ్స్ 17వ ఓవ‌ర్‌లో డుప్లెసిస్ ఈ క్యాచ్‌ను అందుకున్నాడు. లిజాడ్ విలియమ్స్ ఈ ఓవ‌ర్‌ను వేశాడు. అత‌డు ఓ లెంగ్త్ బంతిని వేయ‌గా ముంబై బ్యాట‌ర్ డెవాల్డ్ బ్రెవిస్ భారీ షాట్ ఆడాడు. అయితే.. బంతి ఎడ్జ్ తీసుకోవ‌డంతో గాల్లోకి లేచింది. మిడ్ ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న డుప్లెసిస్ వెన‌క్కి ప‌రిగెడుతూ.. త‌న కుడి చేత్తో అద్భుత రీతిలో బంతిని అందుకున్నాడు. ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ‌కు అవ‌మానం..! ముంబై ఇండియ‌న్స్ పై మండిప‌డుతున్న ఫ్యాన్స్‌..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్లు కోల్పోయి 243 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (104; 50 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) శ‌త‌కం బాదాడు. మ‌రో ఓపెన‌ర్ ర్యాన్ రికెల్టన్ ( 98; 48 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స‌ర్లు) తృటిలో సెంచ‌రీని చేజార్చుకున్నాడు. కింగ్స్ బౌల‌ర్ల‌లో నాంద్రే బర్గర్ రెండు వికెట్లు తీశాడు. విలియమ్స్, రొమారియో షెపర్డ్, తాహిర్ త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

ట్రెండింగ్ వార్తలు