Rohit Sharma : రోహిత్ శ‌ర్మ‌కు అవ‌మానం..! ముంబై ఇండియ‌న్స్ పై మండిప‌డుతున్న ఫ్యాన్స్‌..

ఇటీవ‌ల రోహిత్ శ‌ర్మ‌ను కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించి విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న ముంబై ఇండియ‌న్స్ పై తాజాగా మ‌రోసారి ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు.

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ‌కు అవ‌మానం..! ముంబై ఇండియ‌న్స్ పై మండిప‌డుతున్న ఫ్యాన్స్‌..

Rohit Sharma missing from Mumbai Indians team india test poster

Updated On : January 13, 2024 / 8:08 PM IST

Rohit Sharma – Mumbai Indians : ఇటీవ‌ల రోహిత్ శ‌ర్మ‌ను కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించి విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న ముంబై ఇండియ‌న్స్ పై తాజాగా మ‌రోసారి ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. సోష‌ల్ మీడియాలో ముంబై పోస్ట్ చేసిన పోస్ట‌రే ఇందుకు కార‌ణం. అస‌లు ముంబై జ‌ట్టులో ఏం జ‌రుగుతుందోన‌ని అనే ఆందోళ‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు.

జ‌న‌వ‌రి 25 నుంచి భార‌త జ‌ట్టు ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడ‌నుంది. ఈ నేప‌థ్యంలో బీసీసీఐ శుక్ర‌వారం తొలి రెండు టెస్టుల్లో పాల్గొనే భార‌త జ‌ట్టును ఎంపిక చేసింది. కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌నే కొన‌సాగ‌నుండ‌గా సీనియ‌ర్ ఆట‌గాళ్లు పుజారా, అజింక్యా ర‌హానేకు మొండిచేయి ఎదురైంది. వైస్ కెప్టెన్‌గా జ‌స్‌ప్రీత్ బుమ్రాను నియ‌మించింది.

Malaysia Open 2024 : చరిత్ర సృష్టించిన సాత్విక్‌-చిరాగ్ జోడి.. మ‌లేషియా ఓపెన్‌లో ఫైన‌ల్‌కు

కాగా.. దీనిపై ముంబై ఇండియ‌న్స్ ఓ పోస్ట‌ర్‌ను క్రియేట్ చేసి విడుద‌ల చేయ‌డంతో కొత్త వివాదం మొద‌లైంది. ముంబై రిలీజ్ చేసిన పోస్ట‌ర్‌లో కేఎల్ రాహుల్, శ్రేయ‌స్ అయ్య‌ర్‌, బుమ్రాల ఫోటోలు ఉన్నాయి. కెప్టెన్ అయిన రోహిత్ శ‌ర్మ ఫోటో లేదు. దీంతో అభిమానులు మండిపడుతున్నారు. ఇది ముమ్మాటికీ రోహిత్ శ‌ర్మ‌ను అవ‌మానించ‌డమే అని అంటున్నారు.

రోహిత్ శ‌ర్మ‌, ముంబై జ‌ట్టు మ‌ధ్య‌లో ఏదో జ‌రుగుతుంద‌ని చెబుతూ మీమ్స్ షేర్ చేస్తున్నారు.

Bizarre incident : బౌల‌ర్ నెత్తికెక్కిన దుర‌దృష్టం.. బ్యాట‌ర్‌ది సూప‌ర్ ల‌క్‌.. బీబీఎల్‌లో విచిత్ర‌ ఘ‌ట‌న