Bizarre incident : బౌల‌ర్ నెత్తికెక్కిన దుర‌దృష్టం.. బ్యాట‌ర్‌ది సూప‌ర్ ల‌క్‌.. బీబీఎల్‌లో విచిత్ర‌ ఘ‌ట‌న

క్రికెట్‌లో అప్పుడ‌ప్పుడూ కొన్ని చిత్ర‌, విచిత్ర‌ ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటాయి.

Bizarre incident : బౌల‌ర్ నెత్తికెక్కిన దుర‌దృష్టం.. బ్యాట‌ర్‌ది సూప‌ర్ ల‌క్‌.. బీబీఎల్‌లో విచిత్ర‌ ఘ‌ట‌న

Bizarre incident in BBL

Bizarre incident in BBL : క్రికెట్‌లో అప్పుడ‌ప్పుడూ కొన్ని చిత్ర‌, విచిత్ర‌ ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటాయి. తాజాగా ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌(బీబీఎల్‌)లో ఓ ఘ‌ట‌న చోటు చేసుకుంది. బౌల‌ర్ వేసిన బంతి వికెట్లను తాకింది. అయిన‌ప్ప‌టికీ అంఫైర్ ఔట్ ఇవ్వ‌లేదు. ఆ బాల్ నో బాల్ కూడా కాదు. స‌ద‌రు బ్యాట‌ర్ అదృష్టం ఎంతో బాగుంది. ఎందుకంటే బౌల‌ర్ వేసిన బంతి వికెట్ల‌ను తాకినా కూడా బెయిల్స్‌ కింద‌ప‌డ‌లేదు స‌రికాదా య‌ధాస్థానంలోనే ఉండ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

బీబీఎల్‌లో భాగంగా శ‌నివారం బ్రిస్బేన్ హీట్‌, పెర్త్ స్కార్చ‌ర్స్ జ‌ట్టు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చ‌ర్క్ ఇన్నింగ్స్ చివ‌రి ఓవ‌ర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఓవ‌ర్‌ను పాల్ వాల్టర్ వేశాడు. ఇన్నింగ్స్ ఆఖ‌రి బంతికి నిక్ హాబ్బ‌న్ ఓ భారీ షాట్‌కు య‌త్నించాడు. అయితే.. బంతి బ్యాట్‌ను తాక‌లేదు స‌రికాదా ప్యాడ్ల‌ను తాకుతూ వికెట్లను ముద్దాడింది. వికెట్ల‌కు ఉన్న లైట్లు బ్లింక్ అయినా బెయిల్స్ కింద‌ప‌డ‌లేదు. దీంతో అంతా ఆశ్చ‌ర్య‌పోయారు.

Bhuvneshwar Kumar : భువ‌నేశ్వ‌ర్ రీ ఎంట్రీ అదుర్స్‌.. టీమ్ఇండియాలో చోటు ద‌క్కేనా..?

దీనిపై కామెంటేట‌ర్ మాట్లాడుతూ.. ఇలా ఎలా జ‌రిగింది..? బంతి ఎలెక్ట్రా స్టంప్స్‌ను తాకిన‌ప్ప‌టికి ఎందుకు క‌ద‌ల‌లేదు అని అన్నాడు. ఈ వీడియో వైర‌ల్‌గా మార‌గా నెటిజ‌న్లు ఫ‌న్నీగా కామెంట్లు చేస్తున్నారు. బౌల‌ర్ నెత్తిన దుర‌దృష్టం ఉంద‌ని, బ్యాట‌ర్ ది సూప‌ర్ ల‌క్ అని అంటున్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. పెర్త్ స్కార్చ‌ర్క్ 35 ప‌రుగుల‌తో విజ‌యం సాధించింది. ఈ మ్యాచులో మొద‌ట బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 163 ప‌రుగులు చేసింది. నిక్ హాబ్బ‌న్ (48) కూప‌ర్‌కోన్నోల్లీ (35) లు రాణించారు. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో బ్రిస్బేన్ హీట్ 19.5 ఓవ‌ర్ల‌లో 128 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

Rohit Sharma : అఫ్గాన్‌తో రెండో టీ20.. చ‌రిత్ర సృష్టించ‌నున్న రోహిత్‌.. కోహ్లీ అందుకోవ‌డం క‌ష్ట‌మే..!