Bhuvneshwar Kumar : భువ‌నేశ్వ‌ర్ రీ ఎంట్రీ అదుర్స్‌.. టీమ్ఇండియాలో చోటు ద‌క్కేనా..?

టీమ్ఇండియా సీనియ‌ర్ పేస‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో అదిరిపోయే రీ ఎంట్రీ ఇచ్చాడు.

Bhuvneshwar Kumar : భువ‌నేశ్వ‌ర్ రీ ఎంట్రీ అదుర్స్‌.. టీమ్ఇండియాలో చోటు ద‌క్కేనా..?

Bhuvneshwar Kumar took 8 wickets in first class cricket return after 6 years

Bhuvneshwar Kumar took 8 wickets : టీమ్ఇండియా సీనియ‌ర్ పేస‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో అదిరిపోయే రీ ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు ఆరేళ్ల త‌రువాత రంజీ మ్యాచ్ ఆడుతున్న భువ‌నేశ్వ‌ర్ ఎనిమిది వికెట్ల‌తో చెల‌రేగాడు. 2018లో భువీ చివ‌రి సారిగా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు.

తాజాగా జ‌రుగుతున్న రంజీ ట్రోఫీలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ త‌రుపున బ‌రిలోకి దిగాడు భువ‌నేశ్వ‌ర్‌. కాన్పూర్ వేదిక‌గా బెంగాల్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. త‌న బౌలింగ్‌తో ప్ర‌త్య‌ర్థి బ్యాట‌ర్ల‌ను వ‌ణికించాడు. త‌న‌దైన ఇన్‌స్వింగ్‌, ఔట్ స్వింగ‌ర్ల‌తో బ్యాటర్లను ముప్పు తిప్ప‌లు పెట్టిన భువీ ఎనిమిది వికెట్లు తీశాడు. కాగా.. ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో భువ‌నేశ్వ‌ర్‌ ఎనిమిది వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డం ఇదే తొలిసారి.

ఈ మ్యాచులో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ 60 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. బెంగాల్ బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ కైఫ్ నాలుగు వికెట్లు తీశాడు. సూర‌జ్ సింధు మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా ఇషాన్ పారెల్ రెండు వికెట్లు సాధించాడు. కాగా.. కైఫ్ టీమ్ఇండియా స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ చిన్న త‌మ్ముడు కావ‌డం విశేషం.

Rohit Sharma : అఫ్గాన్‌తో రెండో టీ20.. చ‌రిత్ర సృష్టించ‌నున్న రోహిత్‌.. కోహ్లీ అందుకోవ‌డం క‌ష్ట‌మే..!

అనంత‌రం బెంగాల్ మొద‌టి ఇన్నింగ్స్ ఆరంభించ‌గా భువ‌నేశ్వ‌ర్ చుక్క‌లు చూయించాడు. సౌరవ్ పాల్ (13)ను పెవిలియ‌న్ చేర్చి వికెట్ల వేట‌ను ఆరంభించిన భువీ రెండో బంతికే సుదీప్ కుమార్‌ (0)ను ఔట్ చేశాడు. ఆ త‌రువాత అనుస్తుప్ మజుందార్ (12), కెప్టెన్ మనోజ్ తివారి (3), అభిషేక్ పారెల్ (12), శ్రేయాంష్ ఘోష్ (41), ప్రదీప్త ప్రమాణిక్ (1), సూరజ్ సింధు జైస్వాల్ (20)ల‌ను ఔట్ చేశాడు.

మొత్తంగా 22 ఓవ‌ర్లు బౌలింగ్ చేసిన భువీ ఐదు మెయిడిన్లతో 41 ప‌రుగులు ఇచ్చి 8 వికెట్లు ప‌డ‌గొట్టాడు. భ‌వీ దెబ్బ‌కు బెంగాల్ 188 పరుగులకే ఆలౌటైంది. అయిన‌ప్ప‌టికీ తొలి ఇన్నింగ్స్‌లో 128 ప‌రుగుల ఆధిక్యాన్ని సాధించింది.

Ishan Kishan : దేశ‌వాలీ క్రికెట్ ఆడాల‌ని ద్ర‌విడ్ చెప్పిన త‌రువాత‌.. ఇషాన్ కిష‌న్ రియాక్ష‌న్ ఇదే..!

టీమ్ఇండియా స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ గాయంతో ఇంగ్లాండ్ సిరీస్‌కు దూరం అయిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో అత‌డి స్థానంలో భువ‌నేశ్వ‌ర్ కుమార్‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని నెటిజ‌న్లు కోరుతున్నారు. కాగా.. ఐదు టెస్టు మ్యాచుల సిరీస్‌లో తొలి రెండు టెస్టు మ్యాచుల కోసం శ‌నివారం బీసీసీఐ జ‌ట్టును ప్ర‌క‌టించింది. ష‌మీ స్థానంలో ముకేశ్ కుమార్‌కు ఛాన్స్ ఇచ్చింది. అయిన‌ప్ప‌టికి మిగిలిన మూడు టెస్టుల్లో భువీని ఎంపిక చేయాల‌ని ప‌లువురు నెటిజ‌న్లు కోరుతున్నారు. త‌న కెరీర్‌లో 21 టెస్టులు ఆడిన భువీ 63 వికెట్లు తీశాడు.