Shikhar Dhwan
Shikhar Dhawan: ఐపీఎల్ స్టార్ బ్యాట్స్‌మన్.. పంజాబ్ ప్లేయర్ శిఖర్ ధావన్ ను తండ్రి కిందపడేసి కొడుతున్నాడు. ప్రస్తుత సీజన్ IPL 2022లో పంజాబ్ ఎలెవన్ కింగ్స్ ప్లేఆఫ్స్ కు అర్హత సాధించకపోవడంపై తన తండ్రి కొట్టాడని ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు పెట్టాడు.
బ్యాక్ గ్రౌండ్ లో పాత సినిమాలోని హిందీ డైలాగ్ వస్తుండగా ధావన్ ను కాలితో తన్నుతున్నట్లు ఆ వీడియోల రికార్డ్ అయింది.
కొత్తవాళ్లు చూస్తే అదేదో సీరియస్ గొడవ అనుకోవడం ఖాయం. నిజానికి ఇన్‌స్టాలో ఇలాగే సరదా పోస్టులు పెట్టే ధావన్.. కొన్ని సార్లు అతని కొడుకుతో కలిసి ఇలాంటి వీడియోలు పోస్టు చేస్తుంటాడు.
పంజాబ్ జట్టు ప్రస్తుత సీజన్లో ఆరో స్థానంతో ఆగిపోయింది. 14మ్యాచ్ లు ఆడి 7గెలిచి, 7ఓడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ కు సమానంగా పాయింట్లు సాధించినప్పటికీ రన్ రేట్ లో వెనుకపడటంతో ఢిల్లీకి చివరి స్థానం దక్కింది. బెంగళూరు 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.
ధావన్ ప్రస్తుత సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడి 460 పరుగులు చేయగా.. 3హాఫ్ సెంచరీలు నమోదు చేశారు.