స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023లో భారత్‌కు నిరాశ తప్పలేదు. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. కేఎల్ రాహుల్ (66), విరాట్ కోహ్లీ (54), కెప్టెన్ రోహిత్ శర్మ (47) లు రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌలైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు, జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్ చెరో రెండు, మాక్స్‌వెల్, జంపాలు ఒక్కొ వికెట్ పడగొట్టారు.
అనంతరం ట్రావిస్ హెడ్ (137) సెంచరీతో చెలరేగడంతో ఆస్ట్రేలియా 43 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టీమ్ఇండియా బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు, మహ్మద్ షమీ, సిరాజ్‌లు ఒక్కొ వికెట్ తీశారు. భారత పరుగుల యంత్ర విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నారు. కాగా.. ప్రపంచకప్ గెలుచుకున్న తరువాత ఆస్ట్రేలియా నేరుగా ఆంధ్రప్రదేశ్‌కు రానుంది.
PM Modi : ఫైనల్‌లో ఓటమి.. టీమ్ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రధాని మోదీ..
ఆస్ట్రేలియా జట్టు భారత్‌తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది. అందులో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ విశాఖపట్నం వేదికగా జరగనుంది. నవంబర్ 23న ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ గెలుచుకున్న జోష్‌లో ఉన్న ఆస్ట్రేలియా నేరుగా విశాఖపట్నం రానుంది. కాగా.. వన్డే ప్రపంచకప్ ముందు మూడు వన్డే సిరీస్‌ను ఆడిన సంగతి తెలిసిందే. 2-1తో ఆ సిరీస్‌లో భారత్ విజేతగా నిలిచింది. దీనికి కొనసాగింపుగానే టీ20 సిరీస్ ఆరంభం కానుంది.
టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..
మొదటి టీ20 మ్యాచ్ – నవంబర్ 23న – విశాఖపట్నంలో
రెండవ టీ20 మ్యాచ్ – నవంబర్ 26న – తిరువనంతపురం
మూడవ టీ20 మ్యాచ్ – నవంబర్ 28న – గౌహతి
నాలుగో టీ20 మ్యాచ్ – డిసెంబర్ 1న – నాగ్‌పూర్
ఐదో టీ20 మ్యాచ్ – డిసెంబర్ 3న – బెంగళూరు
Rahul Dravid : చేజారిన కప్.. రాహుల్ ద్రవిడ్ భవిష్యత్తు ప్రశ్నార్థకం..!