FIFA World Cup 2026 : ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో ఇదే తొలిసారి.. నోరు మూసుకున్నందుకు రెడ్ కార్డు..
పరాగ్వే ఫుట్‌బాల్ ఆటగాడు మిగెల్ అల్మిరోన్ ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో (FIFA World Cup 2026)ఓ అరుదైన, అవాంఛిత రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
- Thota Vamshi Kumar
- Updated on- June 20, 2026 / 12:37 PM IST
First Time In FIFA World Cup History Miguel Almiron Shown Red Card Under New Rules
FIFA World Cup 2026 : పరాగ్వే ఫుట్‌బాల్ ఆటగాడు మిగెల్ అల్మిరోన్ ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో ఓ అరుదైన, అవాంఛిత రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవల ఫిఫా అమల్లోకి తెచ్చిన కొత్త నిబంధన ప్రకారం.. మైదానంలో వాగ్వాదం సమయంలో నోటిని చేతితో అడ్డుపెట్టుకుని మాట్లాడినందుకు రెడ్ కార్డు పొందిన తొలి ఆటగాడిగా అల్మిరోన్ నిలిచాడు. ఈ ఘటన శుక్రవారం కాలిఫోర్నియాలోని సాంటా క్లారా వేదికగా జరిగిన పరాగ్వే–టర్కీ ప్రపంచకప్ గ్రూప్-డి మ్యాచ్‌లో చోటుచేసుకుంది.
మ్యాచ్ తొలిఅర్థ భాగపు అదనపు సమయంలో అల్మిరోన్.. టర్కీ ఆటగాడు మెర్ట్ ముల్దూర్‌తో వాగ్వాదానికి దిగినట్లు కనిపించింది. ఆ సమయంలో అతను తన నోటికి చేతిని అడ్డుపెట్టుకుని ఏదో అన్నట్లుగా వీడియోల్లో కనిపించింది. దీనిపై వీడియో అసిస్టెంట్ రిఫరీ (VAR) సమీక్ష అనంతరం రిఫరీ అతనికి నేరుగా రెడ్ కార్డు చూపించాడు. అల్మిరోన్ మైదానం వీడే సమయానికి పరాగ్వే జట్టు 1-0 ఆధిక్యంలో ఉంది.
Rishabh Pant : రిషబ్ పంత్ జీతంలో భారీ కోత.. ఏకంగా రూ.12 కోట్లు! మళ్లీ పాత గూటికే వికెట్ కీపర్!
జాతి వివక్ష, వివక్షపూరిత వ్యాఖ్యలను అరికట్టే లక్ష్యంతో ఫిఫా ఈ కొత్త నిబంధనను ఏప్రిల్‌లో తీసుకుచ్చింది. ఆటగాళ్లు నోటికి చేతిని అడ్డుపెట్టుకుని ఏదైన మాట్లాడితే వారు ఏమి మాట్లాడారో గుర్తించడం కష్టమవుతుందని, అందువల్ల ఇలాంటి చర్యలకు కఠిన శిక్షలు విధించాలని ఫిఫా నిర్ణయించింది. ఈ నిర్ణయం ఈ ప్రపంచకప్‌లో అధికారికంగా అమల్లోకి వచ్చింది.
