×
Ad

Borrowed Bats : అరువు తెచ్చుకున్న బ్యాట్‌తో రికార్డులు సృష్టించిన క్రికెటర్లు.. లిస్టులో ముగ్గురు మ‌నోళ్లు కూడా..

అరువు తెచ్చుకున్న బ్యాట్‌తో (Borrowed Bats) చ‌రిత్ర‌లో నిలిచిపోయే ఇన్నింగ్స్‌లు ఆడిన ఓ ఐదుగురు ఆట‌గాళ్ల గురించి ఇప్పుడు చూద్దాం..

Five cricketers have produced landmark centuries With Borrowed Bats

Borrowed Bats : సాధార‌ణంగా క్రికెట‌ర్లు ఎవ‌రి బ్యాట్‌ను వారే ఉపయోగిస్తుంటారు. అయితే.. కొన్ని సంద‌ర్భాల్లో మాత్రం ప‌క్క‌వారి బ్యాట్ల‌తో బ‌రిలోకి దిగి సంచ‌ల‌న ఇన్నింగ్స్‌ల‌తో రికార్డులు క్రియేట్ చేసిన వారు ఉన్నారు. ఇలా అరువు తెచ్చుకున్న బ్యాట్‌తో చ‌రిత్ర‌లో నిలిచిపోయే ఇన్నింగ్స్‌లు ఆడిన ఓ ఐదుగురు ఆట‌గాళ్ల గురించి ఇప్పుడు చూద్దాం..

షాహిద్ అఫ్రిది..

అరువు తెచ్చుకున్న బ్యాట్‌తో సంచ‌ల‌న రికార్డులు సృష్టించిన వారిలో పాకిస్తాన్ ఆట‌గాడు షాహిద్ అఫ్రిది అగ్ర‌స్థానంలో ఉంటాడు. 1996లో శ్రీలంక‌తో జ‌రిగిన ఓ వ‌న్డే మ్యాచ్‌లో అత‌డు కేవ‌లం 37 బంతుల్లోనే సెంచ‌రీ సాధించాడు. ఈ క్ర‌మంలో వ‌న్డేల్లో అత్యంత వేగ‌వంత‌మైన సెంచ‌రీ చేసిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. చాలా కాలం పాటు ఈ రికార్డుకు అఫ్రిది పేరిటే ఉంది. కాగా.. అత‌డు ఈ రికార్డు సెంచ‌రీ సాధించడానికి ఉప‌యోగించిన బ్యాట్ టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు సచిన్ టెండూల్క‌ర్ ది కావ‌డం గ‌మ‌నార్హం. టెండూల్క‌ర్ త‌న బ్యాట్‌ను వ‌కార్ యూనిస్‌కు ఇవ్వ‌గా.. చివ‌రికి అది అఫ్రిది చేతుల్లోకి వెళ్లింది.

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొన‌డంపై ఉత్కంఠ మ‌ధ్య పాకిస్తాన్ కెప్టెన్ వింత ప్ర‌క‌ట‌న‌..

అభిషేక్ శ‌ర్మ‌..

2024లో జింబాబ్వే ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా అభిషేక్ శ‌ర్మ అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్‌లో అత‌డు డ‌కౌట్ అయ్యాడు. అయితే.. రెండో మ్యాచ్‌లో సెంచ‌రీతో చెల‌రేగిపోయాడు. కేవ‌లం 46 బంతుల్లోనే మూడు అంకెల స్కోరు సాధించాడు. భారత క్రికెటర్ చేసిన అత్యంత వేగవంతమైన సెంచరీలలో ఇది ఒకటిగా నిలిచింది. అయితే.. ఈ మ్యాచ్‌లో అత‌డు ఉప‌యోగించిన బ్యాట్ అత‌డి స్నేహితుడు, టీమ్ఇండియా వ‌న్డే, టెస్టు కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ గిల్ ది.

ఆండీ సాంధమ్..

ఇంగ్లాండ్ కు చెందిన ఆండీ సాంధమ్ 1930లో త‌న చివ‌రి టెస్టు మ్యాచ్ ఆడాడు. త‌న ఆఖ‌రి టెస్టు మ్యాచ్‌లో అత‌డి వ‌ద్ద ఉన్న ఏకైక బ్యాట్ విరిగిపోయింది. దీంతో అత‌డు అప్ప‌టి త‌న జ‌ట్టు కెప్టెన్ ఫ్రెడ్డీ కాల్థోర్ప్ నుంచి ఒక బ్యాట్‌ను అరువుగా తీసుకున్నాడు. కింగ్‌స్ట‌న్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన నాటి మ్యాచ్‌లో ఆండీ 325 ప‌రుగుల‌తో చెల‌రేగాడు. 40 సంవత్సరాల వయసులో సాంధమ్ 40 బౌండరీలు కొట్టి ఇంగ్లాండ్ త‌రుపున టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి ఆట‌గాడిగా నిలిచాడు. ఇక‌ అదే బ్యాట్ తో అత‌డు రెండవ ఇన్నింగ్స్ లో మరో 50 పరుగులు చేశాడు.

శిఖర్ ధావన్..

టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు శిఖర్ ధావన్ కూడా అరువు తెచ్చుకున్న బ్యాట్‌తో అదృష్టం సంపాదించాడు. 2013లో అంత‌ర్జాతీయ టెస్టు క్రికెట్‌లో ధావ‌న్ అరంగ్రేటం చేశాడు. మొహాలిలో ఆస్ట్రేలియాతో జరిగిన త‌న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ధావ‌న్ 187 ప‌రుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో అత‌డు ముర‌ళీ విజ‌య్ బ్యాట్‌తో ఆడాడు. ఈ మ్యాచ్‌లో అత‌డు విజ‌య్‌తో క‌లిసి 289 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్ప‌డం విశేషం. దానిపై మ‌క్కువ పెంచుకున్న ధావ‌న్ 2013 ఛాంపియ‌న్స్ ట్రోఫీలోనూ అదే బ్యాట్‌తో ఆడాడు. ఈ టోర్నీలో ధావ‌న్ రెండు సెంచ‌రీలు చేయ‌డంతో పాటు అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆట‌గాడిగా నిలిచాడు.

Shikhar Dhawan : బీచ్‌లో కాబోయే భార్య‌తో చిల్ అవుతున్న శిఖ‌ర్ ధావన్‌.. ఫోటోలు.

మోహిందర్ అమర్నాథ్..

భారత ఆటగాడు మొహిందర్ అమర్‌నాథ్ కూడా అరువు తెచ్చుకున్న బ్యాట్‌తో అద్భుతాలు చేశాడు. సందీప్ పాటిల్ ఇచ్చిన బ్యాట్‌తో 1982-83లో పాకిస్తాన్ పర్యటనలో అమర్‌నాథ్ 584 పరుగులు చేశాడు. అంతేకాదండోయ్‌.. ఆ తర్వాత అదే బ్యాట్‌తో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో 598 పరుగులు చేశాడు. తరువాత అమర్‌నాథ్ 1983 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. సెమీఫైన‌ల్‌, ఫైన‌ల్ మ్యాచ్ రెండింటిలోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల‌ను గెలుచుకున్నాడు.