ind VS aus test match
India vs Australia Indore Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరుగుతుంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు పూర్తికాగా.. మూడో టెస్ట్ మ్యాచ్ ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలోజరుగుతుంది. బుధవారం మ్యాచ్ ప్రారంభం కాగా.. తొలిరోజే ఇండియా తొలిఇన్నింగ్స్ 109 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా 157 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. ఒక్క రోజులనే 14 వికెట్లు పడటంతో ఇండోర్ పిచ్ పై పలువురు మాజీలు విమర్శలు చేస్తున్నారు. పిచ్ పై తొలిరోజే స్పిన్నర్లకు అంతలా అనుకూలించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌లు మూడు రోజుల్లోనే ముగిసిపోయాయి. మూడో టెస్టులోనూ అదే పరిస్థితి ఏర్పడితే టెస్ట్ ఫార్మాట్‌కు ఇబ్బందికరమైన పరిస్థితిగా మాజీలు పేర్కొంటున్నారు. భారత్ లో టెస్టులను మూడు రోజుల్లో ముగించే పద్దతి సరికాదని భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్ సర్కార్ అభిప్రాయపడ్డారు. బౌలర్లు, బ్యాట్స్ మెన్లు సమాన అవకాశాలు పొందగలిగేలా పిచ్ లు ఉండాలని అన్నారు. బంతి మొదటి రోజు మొదటి సెషన్ నుండి ఊహించని రీతిలో స్పిన్ కు అనుకూలిస్తే టెస్ట్ క్రికెట్ ను అపహాస్యం చేసినట్లవుతుందని ఆయన తెలిపాడు.
India vs Australia 3rd Test: ముగిసిన మొదటి రోజు ఆట.. ఆధిక్యంలో ఆస్ట్రేలియా.. Live Updates
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ సైతం ఇండోర్ పిచ్ పై అసహనం వ్యక్తం చేశాడు. ఏ విధంగా చూసినా ఆరో ఓవర్ నుంచే స్పిన్నర్లకు పిచ్ అనుకూలించడం సరికాదని, అందుకే ఇలాంటి పిచ్ లు నాకు నచ్చవు అంటూ పేర్కొన్నాడు. మొదటి రోజు నుంచి పిచ్ ఇలా స్పిన్ కు అనుకూలించకూడదు. ఇండియా, ఆస్ట్రేలియా జట్లలో ఎవరు గెలుస్తారన్న అంశం పక్కన పెడితే ఇలాంటి పిచ్ లు టెస్టు క్రికెట్ కు మచిది కాదంటూ హేడెన్ పేర్కొన్నాడు. అయితే ఇండోర్ పిచ్ విషయంలో ఐసీసీ చర్యలకు సిద్ధమవుతుందన్న వాదన వినిపిస్తుంది. పిచ్ సగటుకంటే తక్కువ రేటింగ్‌ను పొందే అవకాశం ఉంది. నాగ్‌పూర్, ఢిల్లీ పిచ్‌లకు రేటింగ్ పాయింట్లు మెరుగ్గానే వచ్చాయి. ప్రస్తుతం, ఇండోర్ పిచ్ విషయంలో ఐసీసీ సైతం దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.